ఎమ్మెల్యే ఫేస్ మాస్క్ తో అభిమానాన్ని చాటుకున్న విద్యార్థులు

ఆదిలాబాద్: ఎమ్మెల్యే జోగురామన్న జన్మదిన వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. పట్టణంలోని ప్రభుత్వ క్రీడా పాటశాల విద్యార్థులు వినూత్న రీతిలో ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అభిమానాన్ని చాటుకున్నారు. విద్యార్థులు ఎమ్మెల్యే జోగురామన్న ఫేస్ మాస్కులు ధరించి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం విశేషంగా ఆకట్టుకుంది. కే.కే స్విమ్మింగ్ అకాడమీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరపగా….. తొలుత విద్యార్థులు ఎమ్మెల్యేకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం చిన్నారుల మధ్య ఎమ్మెల్యే కేక్ కట్ చేసి వారికి తినిపించారు. కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాలతో ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల కేరింతలు, చప్పట్ల నడుమ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. జిల్లాకు క్రీడా పాటశాల కేటాయింపులో ఎమ్మెల్యే చేసిన కృషిని గుర్తిస్తూ ఆయనకు విద్యార్థులు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపడం విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్, dyso వెంకటేశ్వర్లు, కేకే స్విమ్మింగ్ అకాడమీ నిర్వాహకులు కొమ్ము కృష్ణ తదితరులు పాల్గొన్నారు.