ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ గా ప్రేమేందర్….

తలమడుగు: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ సంస్థ గత నిర్మాణంలో భాగంగా మంగళవారం రోజు తలమడుగు మండల కేంద్రంలో సాయంత్రం ఎమ్మార్పీఎస్ నూతన కమిటీనీ ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఆరేల్లి మల్లేష్ ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. మండల కన్వీనర్ గా గొంటిముక్కుల ప్రేమేందర్ అదేవిధంగా తలమడుగు గ్రామ కమిటీ అధ్యక్షులుగా మామిడి సురేష్ ఉపాధ్యక్షులుగా వేల్పుల ఆశన్న ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ కోశాధికారిగా శనిగరపు రాములు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రిజర్వేషన్ స్థాపన కై మనందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామని జిల్లా కన్వీనర్ ఆరెల్లి మల్లేష్ కోరారు.