ఉడుమును చంపిన వ్యక్తికి 15 రోజుల జైలు

జన్నారం: అటవీ జంతువు ఉడుమును చంపిన వ్యక్తికి 15 రోజులు రిమాండ్ విదించినట్లు చింతగూడ సెక్షన్ ఆఫీసర్ జే శివకుమార్ తెలిపారు. మంగళవారం అయన మాట్లాడుతూ మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన పానగంటి శ్రీను కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోని చింతగూడ బీట్ లో ఉడుము (బెంగాల్ మానిటర్) వణ్య ప్రాణిని వేటాడి చంపినందుకు గాను ఈ రోజు శ్రీనును లక్షేట్టిపేట కోర్టులో హాజరుపరచగా జడ్జి నిందితునికి 15 రోజుల రిమాండ్ విదించారని అయన తెలిపారు. అయన వెంట చింతగూడ ఎఫ్ బి ఓ శ్రీనివాస్ ఉన్నాడు.