ఈద్గా మైదాన్‌ను ప‌రిశీలించిన ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్ః బక్రీద్ పండుగ నేపథ్యంలో ప్రార్థనల సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పురపాలకం తరపున పూర్తి చర్యలు తీసుకుంటున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రార్థనల సమయంలో ఇబ్బంది కలగకుండా తగు ఏర్పాట్లు చేపడుతున్నారు. వర్ష సూచన నేపథ్యంలో ఆయా మసీదులలోనే సాముహిక ప్రార్థనలు జరుపునేలా మసీదు కమిటిల నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్థానిక ఈద్గా మైదానంలో జరుగుతున్న ముందస్తు ఏర్పాట్లకు సంబంధించిన పనులను ఎమ్మెల్యే జోగురామన్న పర్యవేక్షించి.. సిబ్బందికి సూచనలు చేశారు. గురువారం ఉదయం ముస్లిం సోదరులు ఈద్గా మైదానంలో నమాజ్ ఆచరించనున్న నేపథ్యంలో మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం కారణంగా ఏర్పడిన గుంతలను పుడ్చివేశారు. అయితే గురువారం వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఆయ కాలనీల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని ముందుగానే సూచించినట్లు ఈద్గా కమిటి అధ్యక్షులు సయ్యద్ మోయిస్ తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూబక్రీద్ నేపథ్యంలో ప్రార్థనలకు వచ్చే వారి కోసం ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సామరస్యపూర్వకంగా పండగలను జరుపుకోవాలని సూచించారు. ప్రార్థనల కోసం వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ.వైస్ చైర్మన్ జహీర్ రంజాని, బీ.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్, మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రలాద్.అష్రఫ్, ఇమ్రాన్, సాజిదోద్దీన్, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.