ఇకనుండి ఒక్క వందకే 134 రక్త పరీక్షలు
ఎమ్మెల్యే జోగురామన్న

ఆదిలాబాద్ః ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యతను ఇస్తోందని, అందుకు అనుగుణంగానే సర్కారు దవఖనల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రేడియాలజి ల్యాబ్ ను శనివారం ఎమ్మెల్యే లాంచనంగా ప్రారంభించారు. తెలంగణా డయాగ్నొస్టిక్స్ ద్వార ఇప్పటికే 54 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తుండగా.. పరిక్షల సంఖ్యను 134 కు పెంచుతూ.. అందుకు అవసరమైన సదుపాయాలను, పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. 75 లక్షల రూపాయల వ్యయంతో అధునాతన పరికరాలు, 45 లక్షల వ్యయంతో భవన నిర్మాణ పనులను పూర్తి చేశారు. అంతకుముందు రాష్ట్ర వైధ్యారోగ్య శాఖా మంత్రి హరీష్ రావు వర్చువల్ విధానం ద్వార రాష్ట్రవ్యాప్తంగా ల్యాబ్ లను ప్రారంభించి.. వైధ్యాదికరులకు విస్తృత సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ల్యాబ్ ను ప్రారంభించి… అందుబాటులో ఉంచిన పరికరాలను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, సూపరింటెండెంట్ అశోక్, బీ.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్, నాయకులు మెట్టు ప్రహ్లాద్, సాజిదోద్దీన్, దుర్గం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ….ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వైధ్యారోగ్య రంగానికి తగు ప్రాధాన్యతను ఇచ్చి.. నాణ్యమైన సేవలను అందుబాటులోకి తెస్తోందని అన్నారు. వైద్య పరిక్షలు చేయించుకునే స్తోమత లేకపోవడంతో చాలా మంది పరిక్షలు చేయడానికి వెనకాడుతున్నారని, వ్యాధి ముదిరిన తర్వాత వైద్యం అందించినా ఫలితం లేకుండా పోతోందని అన్నారు. ఇటువంటి ఇబ్బందులను పరిష్కరించాలన్న లక్ష్యంతో తెలంగాన డయాగ్నొస్టిక్స్ ద్వార 134 పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరిక్షల నిర్వహణపై ప్రతినెల సమీక్ష నిర్వహిస్తూ మెరుగైన సేవలు అందించేలా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.