ఆదివాసీల సంక్షేమాన్ని కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు విస్మ‌రించాయి

కాంగ్రెస్ రాష్ట్ర నాయ‌కులు కంది శ్రీ‌నివాస రెడ్డి

ఆదిలాబాద్ః కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని బీఆర్ఎస్ రెండూ ఒక‌టేన‌ని ఈ రెండు ప్ర‌భుత్వాలు ఆదివాసీ ల సంక్షేమాన్ని విస్మ‌రించాయ‌ని కాంగ్రెస్ రాష్ట్ర నాయ‌కులు కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు. గడపగడపకు కాంగ్రెస్ పల్లె పల్లెకు కంది శ్రీనన్న నినాదంతో కంది శ్రీనివాస్ రెడ్డి బేల మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండ‌లంలోని కారా,గ‌ర్క‌గూడ , వంజ్రిగూడ ,సాహెజ్ తాండ ,దుబ్బ‌గూడ‌,టెమ్రిగూడ గ్రామాల‌ను సంద‌ర్శించారు. ప్ర‌తీ గ్రామంలో ఆయ‌న‌కు నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడప గడప తిరిగి కాంగ్రెస్ గ్యారంటీ హామీలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఇంటింటికి కరపత్రాలు పంచుతూ స్టిక్కర్లు అతికించారు. గ‌ర్క‌గూడ గ్రామస్తులు కంది శ్రీ‌నివాస రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఎంత మందికి పోడుభూముల‌కు ప‌ట్టాలిచ్చార‌ని ప్ర‌శ్నించారు. ఎంత మందికి ఇండ్లు కట్టించాడ‌ని అడిగారు. ఇన్నేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నరామ‌న్న ఆదివాసీల క‌ష్టాల‌ను ఏనాడు ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శించారు. అమాయ‌క‌ గిరిజ‌నుల‌కు అన్ని మోస‌పూరిత మాట‌లు చెప్పి ఇన్నేళ్లుగా అధికారంలో కొన‌సాగుతున్నాడ‌ని అన్నారు. జోగు రామన్న ఇచ్చిన హామీలను నెరవేర్చలేని ఒక మోసగాడని ఆరోపించారు. కొత్త‌ రేషన్ కార్డులు లేవ‌ని ,వితంతువులు వృద్ధులు వికలాంగులకు పెన్షన్ స‌రిగా రావ‌డంలేద‌ని రావడం. స‌బ్ ప్లాన్ లోన్లు ఇవ్వ‌డంలేద‌ని ,ల‌క్ష‌రూపాయ‌ల రుణ‌మాఫీ చేయ‌లేద‌ని ఆరోపించారు. కార్యక్రమంలో గీమ్మ సంతోష్,నాగర్కర్ శంకర్,అల్లూరి అశోక్ రెడ్డి,సంతోష్ రెడ్డి,కిష్టా రెడ్డి,మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే,బాపూరావు హుల్కె బేలా మండలం మాజీ ఎంపీపీ,బేలా మండలం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఫైజుల్లా ఖాన్,బేలా మండలం ఎస్. టి సెల్ చైర్మన్ మాడవి చంద్రకాంత్,అయ్యు సర్పంచ్ వరూర్. కే, శంకర్ భోక్రె,సంజీవ్,షకీల్ జిల్లా మైనారిటీ సెల్ చైర్మయిన్,ఎల్మా రామ్ రెడ్డి,గేడం అశోక్,మానే శంకర్,ఓసావర్ సురేష్,పోచ్చన్న, పోతారాజు సంతోష్,షేక్ షాహిద్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్, రాజ్ కుమార్, లాస్మా రెడ్డి, లింగన్న,రాజ్ మొహమ్మద్ బేలా మండలం మాజీ కో ఆప్షన్ మెంబెర్,వాసీమ్ రంజాని,షేక్ సలీం, ప్రవీణ్, ప్రకాష్, ఫీర్దోస్ ఖాన్,సుదర్శన్ రెడ్డి, భోజ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.