ఆదివాసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి
ఎమ్మెల్యే జోగురామన్న

ఆదిలాబాద్: ఆదివాసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని, ఆదివాసి గిరిజనులు దశాబ్దాల కలను సాకారం చేస్తూ వారికి అండగా నిలబడుతోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జిలకేంద్రంలోని టీఎన్‌జీఓస్ భవనంలోబుధవారం పోడు సాగుదారులకు అటవీ హక్కు పాత్రలతో పాటు డిజిటల్ పట్టా పాసు పుస్తకాలను కలెక్టర్రాహుల్ రాజ్ తో కలిసి ఆయన అందించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆదివాసిల సమక్షంలో హక్కుపత్రాలను అందచేశారు. ఏళ్ళ నాటి కల నిజం కావడంతో ఆదివాసీలు హర్షం వ్యక్తం చేశారు. పలువురు ఆనందభాష్పాలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని 4,017 మందికి పట్టాలపంపిణి చేపట్టారు. తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు, అందుకు ప్రత్యేకచొరవ తీసుకుని విశేష కృషి చేసిన ఎమ్మెల్యే జోగురామన్న కు ఆదివాసీలు ధన్యవాదాలు తెలియచేశారు.ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆదివాసీల అభివృద్ధిపై ప్రత్యేకదృష్టి సారించామని అన్నారు. పోడు భూములకు పట్టాలు లేకపోవడంతో ఆదివాసీలు అనేక ఇబ్బందులకుగురయ్యేవారని అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ లు గండ్రత్ రమేష్, మర్నెట్టి గోవర్ధన్, జడ్ పీటీసీ అరుంధతి వెంకట్రెడ్డి, జైనట్ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వేణుగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు