ఆదివాసి గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యురాలు కుస్రం నీలాదేవి

నేరడిగొండ .ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ధన్నోర (బి) గ్రామ సమీపంలో ఇటీవల సామూహి క అత్యాచారానికి గురై మృతి చెందిన గిరిజన మహిళ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యురాలు కుస్రం నీలాదేవి అన్నారు.ఒక అమాయక ఆదివాసీ గిరిజన మహిళపై లైంగిక దాడికి పాల్పడిన నింది తులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. సోమవారం నేరడిగొండ మండ లం చించోలి (బి) గ్రామానికి వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ ఒక ఆదివాసి అమాయక ఆదివాసీ గిరిజన మహిళ పట్ల కామాం ధులు సామూహిక అత్యాచారా నికి పాల్పడడం హేయ్యమైన చర్యగా ఆమె అభివర్ణించారు. ఆదివాసి మహిళను సామూహి కంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించే వరకు తాను విశ్రమించ బోనని అన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుం బానికి అన్ని విధాల ఆదుకు నేందుకు కృషి చేస్తానన్నారు. ఆ గిరిజన మహిళ భర్త రెండేళ్ల క్రితమే మృతి చెందడం వల్ల వార సంతల్లో భిక్షాటన చేస్తూ కుటుంబాన్ని నెట్టు కొస్తుందని, తల్లి గారైన ఇంద్రవెల్లి మండలం ధన్నోర (బి) గ్రామానికి వెళ్లిన ఆ మహిళకు మాయ మాటలు చెప్పి, నమ్మించి ఒంటరి గా చూసి నిందితులు దారుణం గా సామూహికంగా అత్యాచారం చేసి, ఆపై చంపి మృతదేహాన్ని బావిలో పడేసినట్లు తెలు స్తోందని, దీనిపై పూర్తి విచారణ చేపట్టే విధంగా ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్తామని అన్నారు. ఆమెకు ఉన్న ఒకానొక కొడుకు కూడా తండ్రి, తల్లిని కోల్పోయి అనాధగా మిగి లాడని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అత్యాచారానికి గురై బలైన మహిళ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఆమె పేర్కొన్నారు. నిందితుల కు కఠిన శిక్ష పడే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆమె పేర్కొన్నారు. జిల్లా అధికా ర యంత్రాంగం నుండి అందించే సహాయ సహకారాలను, కుటుంబ సభ్యులకు అందే విధంగా కలెక్టర్, ఎస్పీ లతో చర్చించి తగు న్యాయం చేస్తా నన్నారు. కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు. జిల్లాలో ఇటు వంటి సంఘటన లు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశా రు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంరం జంగు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుంజల భాస్కర్ రెడ్డి, బజార్హతనూర్ మండల ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్, కుంరం శంబు సర్పంచ్ శంబుగుడా, పెందుర్ లక్ష్మణ్ రావు, తదితరులు పాల్గొన్నారు.