ఆదిలాబాద్ కు వచ్చిన మాజీ స్పీకర్

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం నిర్వహించే భారీ ఆత్మగౌరవ సభలో పాల్గొనేందుకు తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనా చారి మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ లోని శాంతినగర్ లో గల ఎమ్మెల్యే జోగు రామన్న స్వగృహానికి వచ్చిన మాజీ స్పీకర్ కు ఎమ్మెల్యే స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న తనయుడు, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఎమ్మెల్యే సతీమణి జోగు రమ, డిసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మధుసూదన చారిని శాలువాతో సత్కరించి పూల మొక్కలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీపీ గండ్రత్ రమేష్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజన్న, రంగినేని శ్రీనివాస్, రాము, అశోక్ ఖయ్యూం తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.