ఆదిలాబాద్‌లో 12న తెలంగాణ రన్

ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవ వేడుకలలో భాగంగా పోలీసు, యువజన, క్రీడల శాఖ ఆద్వర్యంలో ఈ నెల 12 న తెలంగాణ రన్ నిర్వహిచనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానికఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి ఉదయం 6.00 గంటలకు తెలంగాణ రన్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. జిల్లాలోని విద్యార్థులు, యువకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ శిక్షణ అభ్యర్ధులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, యువజన, క్రీడా సంఘాలు, సభ్యులు, మెడికోలు, ప్రజలు, వాకర్స్, సీనియర్ సిటిజెన్లు, పోలీసు, ఎక్సైజ్, ఫైర్, ఇతర శాఖల ఉద్యోగులు, మాజీ సైనికులు ఈ తెలంగాణ రన్ లో పాల్గొని విజయవంతం చేయలన్నారు. తెలంగాణ రన్ కార్యక్రమానికి సంబంధిత శాఖ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలనీ కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.