ఆత్మగౌరవం కోసమే రాజ్యాధికారం రావాలి

బిఎస్పి జిల్లా అధ్యక్షులు గడుగు మహేందర్

జైనథ్:మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం వద్ద బిఎస్పీ జిల్లా అధ్యక్షులు గడుగు మహేందర్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలతో కలిసి బహుజన ఆత్మగౌరవ సభ పోస్టర్ విడుదల చేయడం జరిగింది.ఈసందర్భంగా అధ్యక్షులు గడుగు మహేందర్ మాట్లాడుతూ బహుజనులకు అగ్రకుల పార్టీల నాయకులు రైతుబంధు, ఆసరా, దళిత బంధు ,అంటూ పథకాల ఆశ చూపిస్తున్నారు తప్ప ఈ సమాజంలో సమానత్వం గురించి గానీ ఆత్మగౌరవం గురించి మాట్లాడిన పార్టీ, హామీ ఇచ్చిన పార్టీ ఏది లేదని బహుజనుల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని ఈనెల 17న ఇచ్చోడ మండల కేంద్రంలో షార్ప్ గార్డెన్లో బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా జరగనున్న బహుజన ఆత్మగౌరవ సభ కు జిల్లాలోని కార్మికులు,కర్షకులు ,మహిళలు విద్యార్థులు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ హాజరై బహుజనుల ఆత్మ గౌరవం కోసం పోరాడే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు గడుగు మహేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు మ్యన సురేష్ జైనథ్ మండల అధ్యక్షులు రావుల పోచన్న మరియు బిఎస్పి ఆదిలాబాద్ సోషల్ మీడియా ఇంచార్జ్ సృజన్ పాటిల్, బి ఎస్ పి నాయకులు శివ, అశోక్, భూమన్న, దౌలత్, ప్రవీణ్, శుభమ్, దత్తు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.