అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలి

తలమడుగు : రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులవృత్తులకు రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం తలమడుగు మండల అధ్యక్షులు మేకల రవికాంత్ యాదవ్ అన్నారు.శనివారం మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బిసి కులవృత్తులు, చేతివృత్తుల వారికి అందిస్తున్న ఆర్థిక సహాయానికి అర్హులైన ప్రతి ఒక్కరు ధరఖాస్తు చేసుకోవాలన్నారు.. రుణాల దరఖాస్తులకు ప్రభుత్వం గడువును పెంచాలని కోరారు.. బీసీ కుల వృత్తులు కాకుండా బీసీ లో ఉన్న వివిధ కులాల్లో గల నిరుపేదలకు కార్పొరేషన్ ద్వారా రుణాలు ప్రభుత్వం అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల ప్రధాన కార్యదర్శి వెంకన్న, తలమడుగు గ్రామ కమిటీ అధ్యక్షులు అసం రవీందర్, మండల నాయకులు గాజుల సాంబశివ్, మాడురి రమాకాంత్, శ్రీకాంత్, ప్రవీణ్, యాదగిరి, వినోద్, శశికాంత్, ఉషన్న, నరేష్, నవీన్,శ్రీనివాస్,గ్రామాల బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.