అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలి

- జిల్లా కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టులు

ఆదిలాబాద్: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని ఆదిలాబాద్ జర్నలిస్టులు కోరారు. ఈ విషయమై సోమవారం కలెక్టరేట్ లోని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలిసి విన్నవించారు. జిల్లా కేంద్రంలో అనేక ఏండ్ల నుంచి సమాజహితమే పరమావధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు సొంత ఇండ్లు లేవని అద్దె ఇండ్లలో ఉంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందజేస్తామని ప్రభుత్వం ఇది వరకే హామీనిచ్చిన విషయం మీకు విధితమే, ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలోని ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్ నగర్ తదితర చోట్ల అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందించారని వాటి మాదిరిగానే ఆదిలాబాద్ లోనూ అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు అందించాలని కోరారు. కలెక్టర్ ను కలిసిన వారిలో సీనియర్ జర్నలిస్టులు.. నూకల దేవేందర్, మెడపట్ల సురేష్, అల్కె అశోక్, బీర్కూరువార్ వెంకటేష్, ఎరా సుధాకర్, సంద సురేష్, షేక్ మొయిస్, గోపి కృష్ణ, నీలేష్, మహేందర్, గాజరి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.