అర్జీలను పరిశీలించి నిబంధనల మేరకు సత్వర చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ఆదిలాబాద్ ప్రజావాణి వచ్చిన అర్జీలను పరిశీలించి నిబంధనల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల అర్జీలను ఆయన స్వీకరించారు. భూ సంబంధ సమస్యలు, విద్యా, ఫించన్, ఉపాధి కల్పన, పౌర సరఫరాలు, రెవెన్యూ, రెండుపడక గదుల ఇళ్ళు, తదితర సమస్యలపై అర్జీలను కలెక్టర్ స్వీకరించి వాటి పరిష్కారానికి ఆయా శాఖాధికారులకు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. శాఖల వారిగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కారామయ్యేలా కృషి చేయాలన్నారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించెలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించి, వారి తల్లదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం శాఖల వారిగా పెండింగ్ ఉన్న దరఖాస్తులపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ ప్రజావాణిలో శిక్షణ సహాయ కలెక్టర్ పి.శ్రీజ, ఆర్డీఓ రమేష్ రాథోడ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.