అభ్యర్థులు ఓటరు జాబితాలో తమ పేరు, చిరునామా సరి చూసుకోవాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ఆదిలాబాద్ :ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటరు జాబితాలో తమ పేరు, చిరునామా సరి చూసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటరు జాబితాలో పేర్లు లేని వారు ఫాం 6 ద్వారా మళ్లీ నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఎన్నికల సంవత్సరం నేపధ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఓటరు నమోదు, సమగ్ర ఓటరు జాబితాను తయారు చేయడం జరిగిందన్నారు. అగస్టు 31వ తేది వరకు అభ్యంతరాల స్వీకరిస్తున్నామని, 21సెప్టెంబర్ నాటికి డ్రాఫ్ పబ్లికేషన చేయడం జరుగుతుందన్నారు. తుది జాబితను అక్టోబర్ 4న ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈక్రమంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తన పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో కూడా తెలుసుకోవాలని సూచించారు. నామినేషన్ చివరి తేది నుంచి పది రోజుల ముందు వరకు తన పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నటరాజన్, అసిస్టెంట్ ట్రైని కలెక్టర్ శ్రీజ, ఆర్డీవో రమేష్ రాథోడ్, ఆయా పార్టీల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.