అభివృద్ధి పథకాలను మత్స్య కారులు సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్

ఆదిలాబాద్: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను మత్స్య కారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం స్థానిక రెవెన్యూ గార్డెన్లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేపల ఆహార పండుగ కార్యక్రమంలోకలెక్టర్ పాల్గొన్నారు. తొలుత మత్స్య శాఖ అభివృద్ధి ప్రగతినివేదికను జిల్లా మత్స్య శాఖ అధికారి వై.సాంబశివరావు సమావేశంలో వివరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నదని, అవకాశాలను సద్వినియోగం చేసుకొని మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి మత్స్య అభివృద్ధి శాఖ ద్వారా జిల్లాలో 5.62 కోట్ల చేప పిల్లలు, 46 లక్షల రొయ్య పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. మత్స్య అభివృద్ధి పథకం క్రింద ద్విచక్ర వాహనాలు, లగేజి ఆటోలు, చేపల ట్రేలు, వలలు, లైఫ్ జాకెట్స్, సంచార చేపల వాహనాలను 75 శాతం సబ్సిడీతో అందించడం జరిగిందన్నారు. గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకం క్రింద మరణించిన మత్స్య కార్మిక కుటుంబాల సభ్యులకు 5 లక్షల ఎక్స్ గ్రేషియ మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.అంతకుముందు చేపల ఆహార పండుగ సందర్బంగా ఏర్పాటు చేసిన స్టాల్ లను కలెక్టర్ పరిశీలించారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ఎంపీపీ గోవర్ధన్, మత్స్య సహకార సంఘాల ప్రతినిధులు, మత్స్యకారులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.