అభివృద్ధి కి కేరాఫ్ కాంగ్రెస్ సర్కార్
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులుకంది శ్రీనివాస రెడ్డి

ఆదిలాబాద్ : గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏపార్టీ చేయలేదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు.గడపగడపకు కాంగ్రెస్, పల్లె పల్లెకు కంది శ్రీనన్ననినాదంతో కంది శ్రీనివాసరెడ్డి జైనథ్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని బాలాపూర్ ,ఆకుర్ల గ్రామాలలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ గ్యారంటీ హామీలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అవగాహన కల్పించారు. ఇంటింటికి కరపత్రాలు పంచుతూ స్టిక్కర్లు అతికించారు. బాలాపూర్ ఆకుర్లలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు 300 ఇండ్లు కట్టించినవని అన్నారు. సాత్నాల ప్రాజెక్ట్ ,లక్ష్మీపూర్ రిజర్వాయర్ ,మత్తడివాగు ప్రాజెక్ట్ ,సోన్ కాస్ ప్రాజెక్ట్ ,రిమ్స్ దవాఖానా ఎవరు కట్టించిండ్రు అని అడుగుతూ కాంగ్రెస్ అని ప్రజల చేత సమాధానం చెప్పిచారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం బస్ చార్జీలు కరెంట్ చార్జీలు పెంచి పేదల ఉసురు పోసుకుంటుందని అన్నారు. కేంద్రం పెట్రోల్ ,డీజీల్ ,గ్యాస్ సిలిండర్ చార్జీలు పేదల పాలిట గుది బండలా తయారైందని విమర్శించారు. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఐదు వందలకే సిలిడర్ ఇస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వమొస్తే తాను దగ్గరుండి అభివృద్ధి చేస్తానన్నారు. ఈ 14ఏళ్లలో జోగురామన్న ఎంత మందికి ఇండ్లు కట్టించాడని ప్రశ్నించారు. ఎంద మందికి లక్షరూపాయల రుణమాఫీ చేసాడని అడిగారు. ఒక్క ఇల్లు లేదు, ఒక్క రుణమాఫీ లేదు పెన్షన్ లు లేవు మరి ఎమ్మెల్యేగా జోగు రామన్న ఏం చేస్తుండని ప్రశ్నించారు. ఐదెకరాల జోగురామన్న ఐదువేల కోట్లతో ఆస్తులు పెంచుకున్నాడు తప్పితే ప్రజల గురించి ఆలోచించలేదన్నారు. మరి ఇలాంటి ఎమ్మెల్యేను ఓడించాలా వద్దా అని ప్రశ్నించారు. నాలుగుసార్లు రామన్నకు అవకాశమిచ్చారని ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి చాన్స్ ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి అంటే ఎలాగుంటుందో చేసి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లామైనారిటీ సెల్ చైర్మన్ షకీల్ ,రవి, ప్రభాకర్, ముఖీమ్, అజ్మాత్ ఖాన్, పోచ్చన్న, గాజుల కిష్టు, కామ్డే విట్టల్, నార్పేల్లి శ్రీనివాస్ , ఎంపీటీసీ మనోజ్ ,మాజీ ఎంపీటీసీ రెంజర్ల రాజన్న ,గిమ్మసంతోష్ ,నాగర్కర్ శంకర్ ,అల్లూరి అశోక్ రెడ్డి ,దీపక్ రావు, చిత్రు, భీమ్ రావు పటేల్, ఓసావర్ సురేష్, శంకర్, ప్రభాకర్ రావు,గేడం అశోక్,రామ్ రెడ్డి, సంజీవ్ , గంగా రెడ్డి, చంటి షక్ షాహిద్ తదితరులు పాల్గొన్నారు.