అబద్ధాలు మాట్లాడటంలో కాంగ్రెస్ నాయకులు దిట్ట
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న.

ఆదిలాబాద్: 60 ఏళ్ళు పాలించిన బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పుడు చేయలేని పనులు *కెసిఆర్ చేస్తుంటే ఓరువలేక పోవడమే కాకుండా అబద్ధపు మాటలు చెబుతూ బిజెపి కాంగ్రెస్ నేతలు ప్రచారాలు నిర్వహించుకోవడం సిగ్గుచేటని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురువారం పట్టణ అభివృద్ధి ద్వారా వార్డులలో నిరంతర, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతు, అందులో భాగంగానే సుభాష్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే జోగు రామన్న గారు వార్డు కౌన్సిలర్ డాక్టర్ లక్ష్మణ్ తో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. మొదట 30 లక్షలతో సిసి రోడ్ డ్రైనేజీ పనులతో పాటు సవారి బంగ్లాల షెడ్ల నిర్మాణానికి 10 లక్షలు హనుమాన్ ఆలయాలకు మరో 10 లక్షలు కేటాయించి పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.. అభివృద్ధి కార్యక్రమాల పట్ల కాలవనివాసులు హర్షం వ్యక్తం చేశారు. మొదట డప్పు చప్పుల మధ్య ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న గారు మాట్లాడుతూ, ఆదిలాబాద్ పట్టణంలో ఇప్పటి వరకు 250 కోట్ల తో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తున్నామన్నారు.. 68 ఏళ్ళు పాలించిన బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు చేసింది ఏమీ లేదని పైగా త్రాగే నీటి నుండి తినే ముద్ద వరకు ఇష్టారుతిగా రేట్లు పెంచి టాక్స్లు వేయడమే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు..ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజ రెడ్డి , మున్సిపల్ వైస్ చైర్మన్ జెహిర్ రంజాని,వార్డ్ కౌన్సిలర్ డాక్టర్ లక్ష్మణ్,పట్టణ అధ్యక్షులు అజయ్, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రలాద్ , స్వరూప రాణి,వసంత్, సూర్య బాండ్,, సురేఖ, తదితరులు పాల్గొన్నారు.