అంబేద్కర్ సంఘ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్G రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు కొనసాగుతున్న వేళ… జిల్లకేంద్రంలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ భవన నిర్మాణాన్ని ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పట్టణంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ భవన్ ను శనివారం మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ తో కలిసి ఎమ్మెల్యే లాంచనంగా ప్రారంభించారు. ముందుగా శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. అదేవిధంగా ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ ను దళిత సంఘాల నేతలు శాలువా, పుష్పగుచ్చలతో ఘనంగా సత్కరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ… అన్ని వర్గాల అభివృద్దే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న గిరిజన దినోత్సవం రోజున అంబేద్కర్ భవన్ ను ప్రారంభించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రెండు కోట్ల వ్యయంతో భవన నిర్మాణం పూర్తయిందని, భవన ప్రాంగణంలో షెడ్ తదితర నిర్మానాల కోసం నిధులు మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశ సిద్ధాంతాలను నిజం చేస్తూ సీఎం కేసీఆర్ సారాధ్యంలో ముందుకు పోతున్నామన్నారు..కార్యక్రమంలో scdwo సునీత కుమారి, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటి చైర్మన్ దుర్గం శేఖర్, నాయకులూ రాం కుమార్, రత్నజాడే ప్రజ్ఞ కుమార్,పట్టణ అధ్యక్షులు అజయ్.మనోజ్, నక్క రాందాస్,రాజన్న. తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.