అంబేద్కర్ మనవడికి కలిసిన ఎమ్మెల్యే

ఆదిలాబాద్: డాక్టర్ అంబేద్కర్ మనవడు అడ్వకేట్ ప్రకాష్ అంబేద్కర్ ను ఎమ్మెల్యే జోగు రామన్న కలిశారు. ఆదిలాబాద్ లోని రామ్ లీలా మైదానంలోమంగళవారం జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆదిలాబాద్ కు వచ్చిన ప్రకాష్ అంబేద్కర్ను టీటీడీసీ గెస్ట్ హౌస్ లో కలిసిన ఎమ్మెల్యే ఆయన్ని శాలువతో సత్కరించారు.ఈకార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అంజూమ్ బాయి దళిత సంఘాల నాయకులు దుర్గం శేఖర్, ఆనంద్, సందీప్ దండగే,తదితరులు పాల్గొన్నారు.