అదివాసీ బిడ్డల ప్రాణాలు మింగుతున్నా కరంజీవాడవాగు

బ్రిడ్జీ నిర్మించాలని పోరాటన్ని ఉద్రుతం చేస్తాము.. కోట్నాక విజయ్

కుమ్రంబీమ్‌‌. జిల్లా కేరమేరి మండలం కరంజీ వాడలో వాగు కాటేస్తోంది…అదివాసీ బిడ్డల ఆయువు తీస్తోంది… వర్షాకాలం వచ్చిందంటే వాగు ఉప్పోంగి ప్రవాహిస్తోంది… ఉప్పోంగి ప్రవాహించే వాగును దాటలేక. ఏళ్లుగా అదివాసీ బిడ్డలు అవస్థలు పడుతున్నారు..బ్రిడ్జీ లేక. తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నా అదివాసీ గ్రామాన్ని అసిపాబాద్ బిజెపి నాయకుడు తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కోట్నాక విజయ్ అదివాసీ గూడంలో‌పర్యటించారు.


ఈ సందర్భంగా అదివాసీ బిడ్డలతో మాట్లాడారు…‌వారి సమస్యలను అడిగి‌ తెలుసుకున్నారు..గూడానికి సమీపంలో వాగు ఉందని…‌ఆ వాగు పై బ్రిడ్జీ‌లేక. తీవ్రమైన. ఇబ్బందులు పడుతున్నా అవేదన వ్యక్తం చేశారు గిరిజనులు… వర్షాకాలం లో వాగు పై బ్రిడ్జి లేక గూడం నుండి కేరిమేరి అసుపత్రికి వెళ్లలేకపోతున్నారు..సకాలంలో అసుపత్రికి వెళ్లలేక ప్రాణాలు కోల్పోతున్నామని పటేల్ కుమ్రబోజ్జు వాపోయారు…ఇప్పటి వరకు గ్రామంలో ఎడుగురు ప్రాణాలు కోల్పోయారన్నారు.. బ్రిడ్జి పనులు చేపట్టాలని కోరితే‌‌.. పనులు ప్రారంబించారు… పనులు పునాదులు దాటడంలేదని పటేల్ విజయ్ ద్రుష్టికి తీసుకవెళ్లారు..

బ్రిడ్జి పరిస్థితిని ప్రత్యక్షంగా చూడటానికి గూడంలోని అదివాసీల ‌కలిసి విజయ్ వాగు వద్దకు వెళ్లారు.. పునాది దశలో బ్రిడ్జీని పరిశీలించారు.. బిఅర్ ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే బ్రిడ్జి నిర్మాణానికి జాప్యమే కారణమన్నారు… బ్రిడ్జి లేక అదివాసీల ప్రాణాలు పోతున్నా ఎమ్మెల్యే సక్కు పట్టించుకోకపోవడం ఎమ్మెల్యే తీరు పై అగ్రహం వ్యక్తం చేశారు.. వెంటనే బ్రిడ్జి నిర్మించడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు…లేదంటే బ్రిడ్జి నిర్మాణం కోసం పోరాటం చేస్తామని అదికారులకు విజయ్ హెచ్చరిక జారీ చేశారు

.

Leave A Reply

Your email address will not be published.