యూట్యూబ్ లో చూసి కోళ్లను‌‌ ఉత్పత్తి యంత్రాన్ని తయారు చేసిన యువకుడు

తయారు చేసిన యంత్రంతో ‌కోళ్లను ఉత్పత్తి చేసి‌ అమ్ముతున్నా అమిత్ మండల్

ఉన్నత చదువులు చదివినా పట్టాలు లేవు… పరిశోదనలో దిట్టకాదు… కాని సాదించాలనే తపన ఉంది…ఆ తపనతో యూ ట్యూబ్ లో అన్వేషణ మొదలు పెట్టారు…అన్వేషణ తోనే కోడిపిల్లలను పోదిగే యంత్రాన్ని తయారు చేశారు…ఆ యంత్రంతో‌‌ వేల. కోడిపిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు.. ‌ఉత్పత్తి చేస్తున్నా కోడి పిల్లలను పౌల్ట్రీ రైతులకు అమ్ముతున్నారు .. లక్షల లాభాలు సాదిస్తున్నారు.. కుమ్రంబీమ్ జిల్లా లో యూ ట్యూబ్ లో చూసి కోడిపిల్లలను తయారు చేసే హ్యచరీస్ ను తయారు చేసిన. యువకుడు అమిత్ ముండల్ పై సాక్షి టీవీ స్పేషల్ రిపోర్ట్

అమిత్ ముండల్. కుమ్రంబీమ్ జిల్లా సాత్ నెంబర్ పరిదిలోని బసంత్ నగర్ కు చెందిన యువకుడు… పదవ. తరగతిలో పెయిల్ అయ్యాడు… తల్లిదండ్రులు వ్యవసాయంచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తున్నారు.. ఆ వ్యవసాయం నష్టాలుతప్ప లాభాలు రావడం లేదు… అయితే ఆ నష్టాల నుండి బయటకు రావడానికి దేశి‌కోళ్లను పెంచాలని నిర్ణయించుకున్నాడు అమిత్..‌కాని దేశి కోళ్లను‌బారీగా పెంచుదామంటే.. కోడి పిల్లలకు అదికంగా ధరలు ఉన్నాయి..ఆ ధరలు పెట్టికోనుగోలు చేయడం బారంగా మారింది..

. అయితే కోడి పిల్లలను ఇతరులు ఉత్పత్తి చేసినవి కోనుగోలు చేయడం బారంగా మారింది… దాంతో తనే కోడిపిల్లలను ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నాడు‌.. ఏట్లా ఉత్పత్తి చేయాలొ తెలియదు… పైగా శిక్షణ తీసుకుందామంటే ఇచ్చే వాళ్లు కూడ అందుబాటులో లేరు.అందుకే కోడి పిల్లలను ఉత్పత్తి చేయడానికి యూ ట్యూబులో అన్వేషణ. మొదలు పెట్టారు.. ఆ యూట్యూబ్ కోడి పిల్లలను తయారు చేసే యంత్రాన్ని ఏలా తయారు చేయాలే తెలుసుకున్నాడు‌అమిత్…‌తెలుసుకోవడమే కాదు… కోడి పిల్లలను తయారు చేసే హ్యచరీస్ యంత్రాన్ని తయారు చేశాడు.. బయట. మార్కేట్లో ఉన్నా యంత్రాలను కోనుగోలు చేస్తే ఆరు లక్షల పైగా ఉంది… కాని ఆమిత్ కేవలం లక్ష ఇరవై వేలకు యంత్రాన్ని తయారు చేశాడు

. అమిత్ ముండల్ ఆ యంత్రం లోనే దేశికోడి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు… ప్రతి ఇరవై ఒకరోజుకు రెండు వేల. కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నాడు అమిత్…‌అయితే దేశి కోళ్లను ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే గుడ్లను బయట‌నుండి కోనుగోలు చేయడం లేదు… తాను పెంచుతున్నా దేశి కోళ్ల ద్వారా గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు.. ఆ గుడ్లతో పిల్లలను ఉత్పత్తి చేస్తూ… ఉత్పత్తి చేసిన పిల్లలను రైతులకు,పౌల్ట్రీ పామ్ యాజమానులకు ఒక్కొక్కో కోడి పిల్లలను ‌నలబై ఐదు రుపాయలకు అమ్ముతున్నాడు…అమిత్ ముండల్ వద్ద కోడి పిల్లలు కొనుగోలు చేయడానికి ‌మహరాష్ట్ర, చత్తీస్ ఘడ్, ఒరిస్సా, మద్య ప్రదేశ్ లాంటి ప్రాంతాల నుండి వచ్చి పౌల్ట్రీ యాజమానులు కోళ్లను కోనుగోలు చేస్తుండటం విశేషం

. ఒకవైపు అమిత్ దేశి కోళ్ల పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు..మరోవైపు పౌల్ట్రీ పామ్ లో దేశి కోళ్లను పెంచుతున్నారు…. మూడు వేలకోళ్లను పెంచుతున్నారు.. పెంచి దేశికోళ్లను మూడు నాలుగు నెలలకు అమ్ముతున్నారు.. కిలోకు ఐదు వందల చొప్పున. అమ్ముతున్నామంటున్నారు…ఒక్కో కోడి ఐదు కిలోల వరకు ఉందని ఆయన చెబుతున్నారు.. అయితే దేశి కోళ్ల దాన కోసం‌అణా పైసా ఖర్చు చేయడం లేదంటున్నారు..పంటపోలంలో‌ పండిన మొక్కజోన్నలు ,వరిదాన్యం దానంగా వేస్తున్నారు అమిత్ …ప్రతి మూడు నెలలకు ఆదాయం మూడు రెండులక్షల యాబై వేల నుండి మూడు లక్షలకు వరకు ఉంటుందన్నారు..‌సంవత్సరానికి పదిలక్షల ఆదాయం వస్తుందని అమిత్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు

.అమిత్ కోళ్ల పెంపకం లాభాల వర్షం కురిపిస్తుండటంతో అందరికి ఆదర్శంగా నిలుస్తోంది… ఇతర. రాష్ట్రాల నుండి పెంపకందార్లు ఇక్కడికి వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు..‌కోళ్ల ఉత్పత్తి పై అమిత్ ‌పౌల్ట్రీ పామ్ లో శిక్షణ తీసుకుంటున్నారు…ఇక్కడ శిక్షణ తీసుకోవడం వల్ల కోళ్ల పెంపకం లో ఎన్నో మేలుకువలు తెలుస్తున్నాయంటున్నారు నేర్చుకోవడానికి వచ్చిన వాళ్లు

Leave A Reply

Your email address will not be published.