సిర్పూర్ టి ఎన్నికల బరిలో ప్రవీణ్ కుమార్?

నియోజకవర్గంలో పర్యటిస్తున్నా అర్ ఎస్ ప్రవీణ్ కుమార్

. ..ఆ నియోజకవర్గం బిఎస్ పి కంచుకోట….ఆ. బహుజనుల. కోట. నుండి ఎన్నికల యుద్దానికి సిద్దమైనా అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ … సిర్పూర్ టి నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో దిగడానికి ఎందుకు ఉత్సహం చూపిస్తున్నారు… ఐదు రోజుల పర్యటన ఎన్నికలయాత్రేనా..?సిర్పూర్ టి నియోజకవర్గం నుండి ఎన్నికల. సమరానికి సై అంటున్నా అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై ప్రత్యేక కథనం

 

కుమ్రంబీమ్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీకి కంచుకోట… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2014. అసెంబ్లీ ఎన్నికలలో‌ అనుహ్యంగా బిఎస్ పి పార్టీ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో విజయం సాధించింది.. విజయం సాదించిన. నియోజక వర్గాలలో నిర్మల్, సిర్పూర్ టి నియోజకవర్గం… నిర్మల్ నుండి మంత్రిఇంద్రకరణ్ రెడ్డి, సిర్పూర్ టి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే కోనప్ప విజయం సాధించారు..ఈ. ఎన్నికలలో బిఎస్పీ ముప్పై నాలుగు ఓట్లు సాదించి…‌అప్పటి టిఅర్ ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యను ఎమ్మెల్యే . కోనప్ప ఓడించారు… ఆ తర్వాత మారిన. సమీకరణాలతో కోనప్ప, ఇంద్రకరణ్ రెడ్డి ఎనుగు పార్టీ వీడి గులాబి పార్టీలో చేరారు..

‌ అయితే సిర్పూర్ టి నియోజకవర్గం నుండి బిఎస్పీ రాష్ట్ర. అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఎన్నికల రంగంలో దిగాలని బావిస్తున్నారట.. అందులో బాగంగా బహుజన రాజ్యదికార యాత్రను ఐదురోజుల. పాటు ‌ నిర్వహిస్తున్నారు…ఐదు రోజుల యాత్రలో తెలంగాణ సర్కారు వైఫల్యాలను ఇంటింటికి తీసుకవెళ్లుతున్నారు.. ఈ సందర్భంగా బహుజన. రాజ్యం అధికారంలోకి రావడానికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.. రాబోయే ఎన్నికలలో బిఅర్ ఎస్ పార్టీని ఓడించాలని ఆర్ ఎస్ ప్రవీణ్ ప్రజలకు పిలుపునిస్తున్నారు.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే కోనప్ప విపలం‌ అయ్యారని విమర్శనాస్త్రాలను సందిస్తున్నారు … బిఎస్పీ అండగా నిలువాలని కోరుతున్నారు… అదికార పార్టీ ఎమ్మెల్యే కోనప్పను ఓడించాలని ప్రజల్లోకి వెళ్లుతున్నారు..

అర్ ఎస్ ప్రవీణ్ సిర్పూర్ నియోజకవర్గం లో ఎన్నికల బరిలోకి దిగాలని ఈ యాత్ర. నిర్వహిస్తున్నారని పార్టీలో ప్రచారం సాగుతోందట… ప్రదానంగా ఆయన. ఇక్కడి నుండి బరిలో దిగాలనే వ్యూహం వెనుక అనేక. కారణాలు ఉన్నాయట… 2014 ఎన్నికలలో పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గెలవడం… దీనికి నియోజకవర్గం లో దళిత ,గిరిజన ,మైనారీటీ,బీసీ ఓటర్లు బారీగా ఉన్నారట.. ఆ. వర్గాలు గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారట…., . పార్టీ తరపున ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తే ఆ వర్గాలు మళ్లీ బిఎస్పీని బలపరుస్తాయని అంచనా ఉందట.. దీనికి తోడు ఎమ్మెల్యే కోనప్ప పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందట.. ఆ వ్యతిరేకత. బిఎస్పీకి అనుకూలంగా మారుతుందట….ఇవన్నీ ఒక ఎత్తేతే అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత సామాజిక వర్గానికి చెందిన వారు… ఎస్సీలు రిజర్వుడ్ సీటు నుండి గెలువడం సాదారణమే… కాని తాను అందుకు బిన్నంగా జనరల్ సీటు నుండి చేసి విజయం సాధించాలని బావిస్తున్నారట… అందుకే సిర్పూర్ టి నియోజకవర్గం ఎంచుకున్నారట‌.‌ ఇది జనరల్ సీటు.. ఇక్కడి పోటీ చేసి అసెంబ్లీ లో అందరి వాడిగా‌ గుర్తింపు పొందాలనుకుంటున్నారట .. అందుకే జనరల్ నియోజకవర్గమైనా సిర్పూర్ టి ఆరునూరైనా బరిలో దిగడం ఖాయమైందట… ఇది నెం 1.నియోజకవర్గం … ఇక్కడి విజయం సాధించి…. బహుజరాజ్యాదికారం సాదించాలనే తపనతో ఉన్నారని జిల్లాలో ప్రచారం సాగుతుందట.. అయితే ప్రజల్లో అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ పై తీవ్రమైన ప్రచారం సాగుతున్నా…‌ పార్టీ వర్గాలు ద్రువీకరించడం లేదట..‌మరి పోటీ చేస్తారో లేదో చూడాలి

Leave A Reply

Your email address will not be published.