అనుమానాస్పదంగా శిశువు మృత దేహం

చింతలమానెపల్లి : మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ సమీపంలోని పెరటిలో శిశువు మృతదేహం లభించినట్లు ఎస్సై విజయ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.మండల కేంద్రంలో నెలలు నిండని శిశువు మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని గుర్తు తెలియని వ్యక్తుల పనిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.