అమోజన్ లో అదివాసీల కళకారుల‌ పెయింటింగ్స్ అమ్మకం

అద్బుతమైనా పెయింటింగ్స్ గీస్తున్నా కళకారులు

.. అదివాసీబిడ్డలు చూస్తే చాలు… బోమ్మలు గీస్తున్నారు… గీసిన. రంగులను అద్దుతున్నారు..రంగులతో బోమ్మలకు జీవం పోస్తున్నారు.. ఆ బోమ్మలే ప్రాణమున్నట్లుగా పలకరిస్తున్నాయి….ప్రపంచ ఖ్యాతిగడిస్తున్నాయి.. ..‌అదివాసీ పెయింటింగ్స్ ను అమెజాన్ అన్ లైన్ మార్కెట్ లో అమ్ముతున్నారు…‌ అమేజాన్ మార్కెట్ లో‌ అదివాసీ కళ చిత్రాల అమ్మకం పై ప్రత్యేక కథనం

… ఉమ్మడి ఆదిలాబాద్ జల్లాలో అదివాసీలు అద్బుతమైన కళకారులు..చిత్రాలు గీయడమైనా… గీసిన కళచిత్రాలకు రంగులు అద్దడంలో అద్బుతమైన నేర్పరులు.. నైపుణ్యంలో వారు శిక్షణ పోందినవారికంటే కళారూపాలు గీస్తారనడం ఏలాంటి అతిశయోక్తి కాదు..చిత్రకళలో నేర్పురులైనా అనేకమంది చిత్రకారులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని కళాశ్రమంలో నిర్వహించి‌న మిత్రమేళలో అద్భుతమైన. చిత్రాలను ప్రదర్శించారు.

 

అయితే అదివాసీలకు చిత్ర కళ… పుట్టుకతో వచ్చిన విద్య…ఏవరి వద్ద నేర్చుకున్నదికాదు.. కాని వారసత్వంగా వచ్చిన అదివాసీలు చిత్రకళ. చూస్తే చాలు ముగ్దులవుతున్నారు. సాదారణంగా ఏ గూడేంలో‌నైనా రంగు రంగుల కళ చిత్రాలు గిరిజనుల గోడల పై కనిపిస్తుంటాయి.. అవి చూడ ముచ్చటగా ఉంటాయి.అంతేకాదు అదివాసీ గూడాలు ప్రక్రుతిలో ఓడిలో ఉంటాయి.. చుట్టు ఎత్తైనా కోండలు.. దట్టమైన. అడవులు.. ఆ అడవుల నుండి పారేసేలయేళ్లు, జలపాతాలు ప్రవాహిస్తాయి..ఆ. కోండలు, అడవుల్లో,‌పక్షులు, వన్యప్రాణుల అందాలు భూతల స్వర్గసీమను మరిపిస్తాయి.

.భూతల స్వర్గ సీమను మరిపించే అందాలను అదివాసీ కళకారులు చిత్రికరీస్తున్నారు.. మట్టి, గాజు పెంకుల పై, మట్టి ముద్దల పై , కాగితాలు, గుడ్డల పై ప్రకుతి అందాలను బోమ్మలుగా చిత్రీకరిస్తున్నారు.. పక్షుల , వన్యప్రాణాలు అందాలు, అదేవిధంగా అదివాసీ బిడ్డల వనదేవతలను చిత్రీకరిస్తున్నారు..‌దండారి పండుగలలో గుస్సాడీ రుపాలు, అదివాసీ అచార సంప్రదాయాలను అద్భుతంగా పెయింటింగ్ చేస్తున్నారు..

అదివాసీ మహిళ కట్టుబోట్టు, పంటచేనులలో పనులు, అదివాసీ మహిళ వంటలను చేస్తున్నా తీరును ‌ బోమ్మలుగా గీస్తున్నారు..ఆఅదివాసీల అందాలు అచ్చం గుద్దినట్లుగా గీస్తున్నారు కుమ్రంబీమ్ జిల్లా రాశిమేట్ట. గ్రామానికి చెందిన అదివాసీ కళకారుడు మడవి రాజేశ్వర్… ఈ కళకారునికి అధ్బుతమైన నైపుణ్యం ఆయన సోంతం… జె ఎన్ టియూ లో బి ఎప్ ఎ పూర్తి చేశారు…గిరిజన అచారా వ్యవహరాలు చిత్రకళతో ప్రాచుర్యంలోకి తెస్తున్నారు.. పెయింటింగ్ లతో లతో ఇతర రాష్ట్రాలలో అవార్డులు సాదిస్తున్నారు

.‌రాజేశ్వర్ తో పాటు అనేక మంది చిత్రకారులున్నారు… మహిళలు, బాలికలు సైతం ఉన్నారు‌‌ …నాగేశ్వరీ విద్యార్థి ఇంటర్ చదువుతోంది…చిత్రాలు వేయడంలో దిట్టం.. అదివాసీల బ్రతుకు చిత్రం వేస్తే చాలు… నిజంగా మన కళ్లముందు కదిలేలా గీయడం అమె సోంతం.

 

.. అదివాసీల చిత్ర కళకు ఇటీవల. బారీగా డిమాండ్ పెరిగింది..‌అదివాసీ కళకారులు సహజ సిద్దంగా గీసిన బోమ్మలు కోనుగోలు చేయడానికి కళాప్రేమికులు ఉత్సహం చూపుతున్నారు…అందుకే అమోజన్ సైతం అదివాసీ కళకారులు గీసిన. బోమ్మలను అన్ లైన్ మార్కెట్ లో‌అమ్ముతోంది..అ బోమ్మలకు ప్రపంచ వ్యాప్తంగా బారీగా డిమాండ్ పెరుగుతుందంటున్నారు‌ కళకారులు.. తాము గీసిన. బోమ్మలను అమోజన్ అన్ లైన్ మార్కెట్ లో అమ్మడం పై అదివాసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.