కుమ్రంబీమ్ జిల్లాలో బావికి నాలుగు వందల ఏళ్లు

అదివాసీల. దహన్ని తీర్చుతున్నా అద్బుతమైన బావి

నాలుగు వందల ఎళ్ల అద్బతమైన బావి….గోండు రాజులు తవ్వించిన బావి… ఆ బావి చుట్టు కర్రలతో కనికట్టును నిర్మించారు… ఆ బావే అదివాసీలకు అమ్రుతం లాంటి నీళ్లను అందిస్తోంది.‌.అదివాసీలకు ప్రాణం పోస్తోంది..ఆ బావినీళ్లను ఎతంతో‌ఎత్తిపోస్తున్నారు.. దాహాన్ని తీర్చుకుంటున్నారు..‌ అదివాసీల అద్బుతమైన బావి పై ప్రత్యేక కథనం

 

… కుమ్రంబీమ్ జిల్లా సిర్పూర్ యు మండలం కంచనపల్లి గ్రామం ఉంది…ఈ. గ్రామంలో ‌అత్యంత పురాతనమైన బావి..ఈ బావి నాలుగు వందల ఎళ్ల క్రితం గోండు రాజులు తవ్వించారు.. ..

. బావి తవ్వించి నాలుగు వందల సంవత్సరాలు దాటిన… ఆ బావే అదివాసీల. ఇప్పటికే దాహన్ని తీర్చుతోంది.. ఆ బావి నుండి తాగడనీటిని అదివాసీలు తెచ్చుకుంటున్నారు …దాహన్ని తీర్చుకుంటున్నారు.. గ్రామంలో ఉన్నా నూట యాబై కుటుంబాల వాళ్లు ఈ. నీళ్లను త్రాగుతూ జీవనం సాగిస్తున్నారు..

… అయితే గోండు రాజులు తవ్వించిన… బావి మాములు బావి కాదు…అద్బుతమైన నైపుణ్యం ఈ బావిలో కనిపిస్తోంది.. సాదారణంగా బావి తవ్వితే..‌ఆ బావి పూడకుండా… కూలకుండా రాళ్లతో కట్టడం చేస్తారు… లేదంటే సిమేంట్ తో చుట్టు రౌండ్ నిర్మాణాలు చేస్తారు. కాని గోండురాజులు అందుకు బిన్నంగా నిర్మించారు… బావి చుట్టు కర్రలను పెర్చారు… దీనివల్ల కనీసం పిడికేడు మట్టి బావిలో చేరకుండా కర్రలతో నిర్మించడం విశేషం

.. అధ్బుతమైన బావి నిర్మాణం చూసి చూపరులు ఆశ్చర్యం పోతుంటారు…దీనికి పురాతన కాలంలో నీళ్లను తోడాలంటే ఎతం వేసేవాళ్లు. ఇప్పటికి ఎతం పద్దతిలో నీటిని తోడుతున్నారు…దాహం తీర్చుకోవడానికి అదే పద్దతి పాటిస్తున్నారు..సాదారణంగా బావులు వేసవి కాలం వచ్చిందంటే… అడుగంటి పోతాయి…చుక్కనీరు ఉండదు.. . గోదావరి ఎండిపోయిన. సందర్భాలున్నాయి… కాని బావి ఎండిందని చూడలేదంటున్నారు గిరిజనులు. ఊట బావులా ఎప్పుడు నీళ్లతో కళకళాడుతుందని చెబుతున్నారు

 

. ఈ బావి అదివాసీల దాహర్తిని తీర్చడమే కాదు… బావినీరుకు పవిత్రమైనదిగా భావిస్తున్నారు గిరిజనులు… గిరిజనులు పుష్యమాస్య సందర్భంగా వారి దేవుతలకు స్నానం ఆచరించడానికి నదుల వద్దకు దేవత విగ్రహలను తీసుకవెళ్లుతారు… ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన గిరిజనులంతా వారి దేవతలకు స్నానం ఇక్కడే స్నానం చేయిస్తున్నారు…పవిత్ర బావి నీళ్లతో దేవతలకు స్నానం చేయించడం అది దేవతల ఆశీస్సులు లబిస్తాయంటున్నారు…ఇంతటి పవిత్రమైన బావి వారసత్వ సంపదగా గుర్తించాలని అదివాసీలు సర్కారు కోరుతున్నారు

Leave A Reply

Your email address will not be published.