మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం కృషి
జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్

ఆదిలాబాద్: మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నదని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని స్థానిక జనార్దన్ రెడ్డి గార్డెన్ లో నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ, రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ప్రతినిత్యం సంబరంగా నిర్వహించడం జరుగుతుందని అధికార యంత్రాంగం పనితీరు ఎంతో బాగుందని అభినందించారు. ప్రభుత్వం సూచించిన విధంగా ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాన్ని ఎలాంటి లోటుపాట్లు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేస్తున్నాదని కొనియాడారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ఈసమావేశంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరి బాయి, డీసీసీబీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్లు అడ్డి బోజారెడ్డి, రౌత్ మనోహర్, అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు, జిల్లా మహిళా అధికారులు మిల్కా, సునీత కుమారి, కృష్ణవేణి, శ్రీవల్లి, మహిళలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు, తదితరులు పాల్గొన్నారు.