నేడు తెలంగాణ సాహిత్య దినోత్సవం

ఆదిలాబాద్: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సాహిత్య దినోత్సవమును పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ తెలిపారు. తెలంగాణ అస్తిత్వం -తెలంగాణ సాధించిన ప్రగతి అనే అంశంపై తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ కవులు కవితాగానం చేయనున్నారని తెలిపారు. ఇట్టి తెలంగాణ సాహిత్య దినోత్సవములో కవులు, సాహితీవేత్తలు ప్రముఖులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.