తొలి ఏకాదశి పాల్కి శోభాయాత్రలో పాల్గొన్న బలరాం జాదవ్

గుడిహాత్నూర్: మండల కేంద్రంలో నిర్వహించిన ఆషాడ తొలిఏకాదశి పాల్కి శోభయాత్రలో తెలంగాణరాష్ట్ర అధ్యాపకులసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బలరాం మాట్లాడుతు హిందువులకు తొలి ఏకాదశి చాలా ప్రత్యేకమైనదని,ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారని అన్నారు.ఈ రోజు ఉపవాసాలు ఉండి విష్ణువుకు అంకితమిస్తే మరణాంతరం మోక్షం కలుగుతుందని హిందువుల నమ్మకమని అన్నారు.విష్ణుమార్తి సృష్టికర్త అని,లోకరక్షకుడని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నృత్యాలతో అలరించారు.విష్ణు సహస్రనామం జపించారు.అనంతరం విఠలేశ్వర స్వామిని దర్శించుకొని ప్రజలంతా పాడి పంటలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
అలాగే ఇచ్చోడ మండల కేంద్రంలోని విట్టలేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.