ఘనంగా ఇప్ప పువ్వు పండ
రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరి బాయి

ఉట్నూర్: ఇప్ప పువ్వు పండుగ శనివారం ఉట్నూర్ లోని కేబి కాంప్లెక్స్ లోగల సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది..ముందుగా ఇప్ప చెట్టు కు ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీ కుమ్ర ఈశ్వరి బాయి మాట్లాడుతూ ఇప్ప పువ్వు ద్వారా అనేక ప్రయోజనలున్నాయని ఇప్ప లడ్డులు గర్భిణీ మహిళల పాలిట గొప్పవరమని ఇప్ప లడ్డు ద్వారా మహిళల్లో రక్తహీనత సమస్యను దూరం చేయవచ్చని సర్వ ఔషధ గుణాల సమూహం ఇప్ప చెట్టు అని అన్నారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని ఆమె అన్నారు.అనంతరం ఇప్ప పువ్వు తో తయారు చేసిన వివిధ ఆదివాసీ చిరు తిళ్లను పరిశీలించారు .ఆదివాసీ చిన్నారుల నృత్యాలను తిలకించారు.కార్యక్రమంలో ఆదిలాబాద్ జడ్పి చైర్మన్ జనార్దన్ రాథోడ్ ఐటిడిఎ చైర్మన్ కనక లక్కెరావ్,పద్మ శ్రీ అవార్డు గ్రహీత కనక రాజు,మాజీ ఎస్సి ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలబాయి,జీవ వైవిధ్య నిర్వహణ కమిటీ సభ్యులు మర్సుకొల తిరుపతి,జిల్లా సార్మీడి దుర్గు,ఐటీడీఏ డైరెక్టర్ భూమన్న, విఠల్ రావ్, బాగుబాయి,సలీమ్ తదితరులు ఉన్నారు.