యువతి తనతో పెళ్లికి ఒప్పుకోలేదని హత్య చేసిన మహిళ
గత కోన్ని రోజులుగా సహజీవనం సాగిస్తున్నా యువతి, మహిళ

.ఓ అమ్మాయి, మహిళ ఇద్దరు ప్రేమించుకున్నారు… సహ జీవనం సాగించారు.. కలిసి జీవించాలనుకున్నారు… మూడు ముళ్లతో ఒక్కటి కావాలనుకున్నారు.. కాని మహిళతో మూడుమూళ్ల బందానికి అమ్మాయి ఎదురు తిరిగింది…..ఎదురుతిరిగినా అమ్మాయి పై మహిళ పగ పెంచుకున్నది….కత్తితో కాటేసింది.. ప్రాణం తీసింది… మంచిర్యాల అమ్మాయి, మహిళ. ప్రేమ కథ చిత్రమ్ పై ప్రత్యేక కథనం
…. ఆ. ఇద్దరు అడవాళ్లు. కలలు కన్నారు… కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు… మంచిర్యాల జిల్లా కేంద్రంలో నెన్నెల మండలం మన్నేగూడే కు చెందిన మహేశ్వరీ , మామిడి గట్ట గ్రామానికి చెందిన అంజలీ ఒకే ఇంట్లో ఉంటున్నారు.. సహజీవనం సాగించారు.. ఇక మూడు ముళ్లతో ఏకం కావాలని మహిళ ఎన్నో కలల కన్నది…అదే విషయాన్ని అంజలికి చెప్పింది.. పెళ్లితో ఎకం కావాలనే మహేశ్వరీ ప్రతిపాదనను అంజలి వ్యతిరేకించింది.. సమాజానికి విరుద్దంగా ఉండే ఇద్దరు అడవాళ్ల. వివాహాన్ని అంజలి వద్దని మహేశ్వరి కి చెప్పింది…
.. అంజలి మాటలు విని షాక్ గురైంది మహేశ్వరీ… తనను వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకించడాన్ని తట్టుకోలేకపోయింది. మహేశ్వరీ. నాకు దూరవమవుతున్నా అంజలి పై ద్వేషాన్ని పెంచుకున్నది.. పైగా తనను కాదని శ్రీనివాస్ తో చునువు గా అంజలి ఉండటాన్ని మహేశ్వరీ తట్టుకోలేక పోయింది…
…ఇక అంజలి తనకు దక్కదని మహేశ్వరి బావించింది… తనకు దక్కని అంజలి ఏవరికి దక్కవద్దని పగ పెంచుకోన్నది…ఆ పగలో బాగంగా లో అంజలిని కడతేర్చాలని నిర్ణయించింది.. అందులో బాగంగా మహేశ్వరీ మామిడిగట్ట. గ్రామం సమీప ప్రాంతానికి అంజలిని తీసుకవెళ్లింది..ఈసందర్బంగా తనను పెళ్లి చేసుకోవాలని అంజలిని మహేశ్వరీ కోరింది.. మహేశ్వరి ప్రతిపాదనను వ్యతిరేకించింది..అదే కోపంలో వెంట తెచ్చుకున్నా కూరగాయల కత్తితో అంజలి గోంతు కోసింది.. విచ్చలవిడిగా కడుపులో పోడిచింది… దాంతో అంజలికి తీవ్రమైన గాయాలయ్యాయి.. ఇదే సందర్భంగా మహేశ్వరీ తనను గాయపరుచుకున్నది..అంజలి తనపై దాడి చేసిందని బుకాయించడానికి మహేశ్వరీ కత్తి దాడి చేసుకోవడంవిశేషం
. ఆతర్వాత. మహేశ్వరి ఒక వ్యక్తికి పోన్ చేసింది..ఆ. వ్యక్తి దాడి చేసిన. ప్రాంతానికి చేరుకోని మహేశ్వరీని, అంజలిని మంచిర్యాల అసుపత్రికి తరలించారు..తీవ్రమైన. గాయాలపాలైనా అంజలి అసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు
..అంజలి హత్య పై మహేశ్వరీని పోలీసులు విచారించారు. విచారణలో భయంకరమైన. నిజాలు బయటపడ్డాడు… తనను పెళ్లి చేసుకోవాలని అంజలిని అడిగానని..అంజలి ఒప్పుకోలేదని.. అందుకే హత్య చేశానని పోలీసుల విచారణలో వెల్లడించిందని సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు..అదేవిధంగా హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరాన్ని మహేశ్వరీని ఒప్పుకోవడంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు