మంచిర్యాల. జిల్లాలో అడ్డగోలుగా సాగుతున్నా వన్యప్రాణుల వేట
సంతలో సరుకులా వన్యప్రాణుల మాంసాన్ని అమ్ముతున్నా వేటగాళ్లు

. విద్యుత్ ఉచ్చులు బిగిస్తున్నారు.. వన్యప్రాణులను ఉరితీస్తున్నారు..బరిసేలు విసురుతున్నారు.. దుప్పులు, జింకలను వేటాడుతున్నారు.. వేటాడిన వన్యప్రాణులు మాంసాన్ని సంతలో సరుకులా అమ్ముతున్నారు.. అంతేకాదు ఉమ్మడి ఆదిలాబాద్ నుండి హైదారాబాద్ వరకు అమ్మకాల. దందాసాగిస్తున్నారు వేటగాళ్లు… వన్యప్రాణుల వేటసాగిస్తున్నా వేటగాళ్లేవరు … ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడ్డగోలుగా సాగుతున్నా వన్యప్రాణుల వేటపై ప్రత్యేక కథనం
. ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వేటగాళ్లు రేచ్చిపోతున్నారు.. విచ్చల విడిగా వన్యప్రాణులను వేటాడుతున్నారు… ప్రదానంగా ఈ వేట మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్, కోటపల్లి,వేమనపల్లి, బెల్లంపల్లి, జన్నారం, కవ్వాల్ టైగర్ జోన్ లో, నిర్మల్ జిల్లాలో ని ఖానాపూర్ , కడెం అటవీ ప్రాంతంలో, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్ ప్రాంతంలో జోరుగా వేటసాగుతోంది
…
… ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉన్నాయి… ఆ అడవుల్లోనే వేటగాళ్లు విద్యత్ ఉచ్చులు బిగిస్తున్నారు… బరేసలు విసురుతున్నారు. వలలు పెడుతున్నారు.. నీలుగాయిలు, జింకలు, దుప్పులు, అడవి గోర్రేలను బలి తీసుకుంటున్నారు..
. మంచిర్యాల. జిల్లా చెన్నూర్ లో గుట్టుగా జరుగుతున్నా వేట.పై ఇటీవల భయంకరమైన. విషయాలు బయటపడ్డాయి..వేటగాళ్లు దుప్పిని వేటాడారు. వేటాడిని దుప్పిని తలను నరికారు మాంసపు ముద్దలుగా మార్చారు. ఆ మాంసపు ముద్దలను స్థానికంగా పోగులు పిలుస్తారు… ఆ పోగులను అర్డర్ ఇచ్చిన. అమ్మేస్తున్నారు వేటగాళ్లు… ఎకంగా వన్యప్రాణులను మాంసాన్ని సంచిలో పట్డుకోని అర్డర్ ఇచ్చిన. వాళ్లంటికి చేర్చుతోంది ముఠా.. కిలో మూడువేల చోప్పున. వేటగాళ్లు వన్యప్రాణుల మాంసాన్ని అమ్ముతున్నారు
.. అయితే వన్యప్రాణుల మాంసాన్ని స్థానికంగా అమ్మడమేకాదు.. .మంచిర్యాల, కరీంనగర్, నిజామాబాద్ , హైదారాబాద్ లాంటి ప్రాంతాలకు వన్యప్రాణుల మాంసాన్ని అమ్ముతున్నారు… ఈ మాంసాన్ని తరలించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు వేటగాళ్లు… అడవి జంతవుల. మాంసాన్ని తింటే , రోగాలు దూరమవుతాయని నమ్మకంతో కిలో ఎంతధరైనా కోనుగోలు చేస్తున్నారు కోందరు వ్యక్తులు ….ఇదే అదనుగా తీసుకోని వేటగాళ్ళు వన్యప్రాణుల మాంసపు దందాను సాగిస్తున్నారు.. ఈ దందా సాగిస్తూ రోజుకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు వేటగాళ్లు.. వేటగాళ్ల వేటకు వన్యప్రాణులు బలవుతున్నా అటవీ అదికారులు చర్యలు తీసుకోవడం లేదని అరోపణలు ఉన్నాయి.. ఇప్పటికైనా.వన్య ప్రాణులను రక్షించడానికి చర్యలు చేపట్టాలని అటవీ అదికారులను కోరుతున్నారు జంతుప్రేమికులు..