గూడేం నీటి యుద్దంలో బిఅర్ ఎస్ మునుగుతుందా?
సాగునీటి సమరం ఓట్ల వర్షం కురిపిస్తుందని ఆశలు పెట్టుకున్నా కాంగ్రేస్.. ఆ ఆశలను కోట్టిపారేస్తున్నా ఎమ్మెల్యే దివాకర్ రావు

నీళ్లు నిప్పు రాజేస్తున్నాయి… ఎండిపోతున్నా పంటల కోసం తిరుగబడుతున్నా రైతులు… ఎమ్మెల్యే గూడేం గుండేళ్ల. దడపుట్టిస్తున్నా ఎత్తిపోతల రైతుల. ఉద్యమం …సాగునీరు ఉద్యమం బిఅర్ ఎస్, కాంగ్రెస్ మద్య సమరంగా మారిందా? ఎన్నికలలో అదికార పార్టీ రాత మార్చుతుందా? నీళ్ల. ఉద్యమం కాంగ్రెస్ ఎన్నికలలో గట్టేక్కిస్తుందా?
మంచిర్యాల. జిల్లాలో బిఅర్ ఎస్ , కాంగ్రెస్ మద్య నీటి సమరం ప్రత్యేక కథనం
.. మంచిర్యాల జిల్లా గూడేం ఎత్తిపోతల ఆయకట్టు రైతుల పోరు ఉద్రుతమైంది… దండే మండలం గూడేం గ్రామంలో గోదావరి పై లిప్ట్ ను నిర్మించింది… ఈ లిప్ట్ ద్వారా నే దండేపల్లి, లక్షిట్ పెట్, హాజీపూర్ మండలంలో ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు..కాని సాగునీరు అందించే పైపులు పగిలిపోయాయి.. దాంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదు..
సాగునీరు అందక. వేల. ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి… ఎండిపోతున్నా వరిపోలాలకు సాగునీరు ఇవ్వాలని రైతులు గత కోన్ని రోజులుగా ఉద్యమిస్తున్నారు.. కడెం ప్రాజెక్టు నుండి ఆయకట్టు నుండి సాగునీరు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.. అందులో బాగంగా సర్కారు పై ఒత్తిడి పెంచడానికి రహదారి దిగ్బంధం, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు రైతులు
.. అయితే కాంగ్రెస్ పార్టీ సాగునీటి సమస్యను పరిష్కరించాలని సర్కారు ఓత్తిడి పెంచడానికి ఉద్యమం చేపట్టింది… అందులో బాగంగా కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో దండేపల్లి లో కడెం ప్రాజెక్టు నుండి సాగునీరు అందించాలని , ఎత్తిపోతల పథకాన్ని మర్మమత్తులు చేయాలని అమరణ దీక్ష చేపట్టింది…. అదేవిధంగా మంచిర్యాల జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది…ఆ బంద్ విజయవంతమైంది..
.. ఈ. సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు వైపల్యం వల్ల సాగునీరు అందడం లేదని ప్రజల్లోకి తీసుకవెళ్లింది కాంగ్రెస్… వేల ఎకరాల ఎండిపోతున్నా ఎమ్మెల్యే స్పందించడం లేదని విమర్శనాస్త్రాలు సందిస్తోంది..ప్రజల్లో ఎమ్మెల్యే పై వ్యతిరేకతను రాజేసి తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.. ఇప్పటికే ఇప్పటికే రెండు సార్లు మాజీ ఎమెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్యే గా ఓటమి పాలయ్యారు… ఈ. వ్యతిరేకతోనైనా ఎన్నికలలో ఒడ్డేక్కాలని ప్రేమ్ సాగర్ బావిస్తున్నారట ..మూడు మండలాల్లో వేల మంది ఆయకట్టు రైతులు ఉండటంతో వారంతా తనకు ఎన్నికలలో అండగా నిలుస్తారని ప్రేమ్ సాగర్ బావిస్తున్నారట.. ఎన్నికలలో గెలువడం ఖాయమని ఆయన అంచనాలు వేసుకుంటున్నారట..
… అయితే రైతుల సాగునీటి ఉద్యమం ఎమ్మెల్యే దివాకర్ రావు కంటి మీద కునుకులేకుండాచేస్తోందట.. రోజు రోజుకు ఉద్యమం ముదరుతుండటం పై ఎమ్మెల్యే అందోళన చెందుతున్నారట.. ఈ ఉద్యమం ఉద్యమం మరింత ముదిరితే వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే సీటుకు ఎసరు తెస్తుందని దివాకర్ రావు భయపడుతున్నారట.. ఇప్పటికే సమస్యను సర్కార్ ద్రుష్టికి తీసుకవెళ్లారట.ఎమ్మెల్యే.. ఎత్తిపోతల పథకం మర్మమత్తుల కోసం రేపుమాపు జీఓ వస్తుందట… నిదులు మంజూరు కాగానే ఎత్తిపోతల మరమ్మత్తు పనులు చేపట్టడానికి సిద్దమవుతున్నారట.. కాంగ్రెస్ కు రైతుల ఉద్యమం ఊపును ఇచ్చిన ఎన్నికల నాటికి ఊపునిలువదని దివాకర్ రావు బావిస్తున్నారట… పైగా సాగునీరు కోసం రైతులు అందరు కదిలినా ప్రేమ్ సాగర్ వ్యతిరేక వర్గం ఉద్యమం లో పాల్గోనలేదట.. అలాంటిది ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు ఎన్నికలలో విజయం సాదిస్తామని పగటి కలలు కంటున్నారని దివాకర్ రావు కోట్టిపారేస్తున్నారట.. ఆరునూరైనా తనే మళ్లీ ఎన్నికలలో విజయం సాదిస్తానని దీమాతో ఉన్నారట దివాకర్ రావు.. మరి నీళ్ల. ఉద్యమం లో ఏవరు మునుగుతారో… ఏవరు పైకి లేస్తారో చూడాలి