వరంగల్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత…

బిఅర్ ఎస్ ,బిజెపి నాయకుల. పోటాపోటీనినాదాలు

రైలు క్రేడిట్ కోసం రణం‌‌‌‌…బిజెపి,బిఅర్ ఎస్ పోటాపోటి నినాదాలతో వరంగల్ రైల్వేస్టేషన్ దద్దరిల్లింది..వందే భారత్ ట్రైన్ రాకతో ఓరుగల్లులో టెన్షన్ నెలకొంది. బిజెపి, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పోటాపోటీగా ట్రైన్ కు స్వాగతం పలికారు. రెండు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకొని నినాదాలు చేసి స్టేషన్ ను హోరెత్తించారు. రెండు వర్గాలు పరస్పర నినాదాలతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. టిఆర్ఎస్ తరఫున ఎంపి దయాకర్ ఎమ్మెల్యే నరేందర్, బిజెపి తరఫున జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ,రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రైల్వే స్టేషన్ కు చేరుకొని ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. రెండు పార్టీల కార్యకర్తలు నినాదాలు ప్రతినినాదాలతో ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు భారీగా మోహరించి పకడ్బందీ చర్యలు చేపట్టారు. పోలీసుల జోక్యంతో ఇరుపార్టీల నాయకులు పచ్చ జెండా పట్టుకుని వందే భారత్ ట్రైన్ కు స్వాగతం పలికి ముందుకు సాగనంపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్ రైల్వేస్టేషన్లో నిముషం పాటు ట్రైన్‌ ఆగడంతో టిఆర్ఎస్ బిజెపి నాయకులు వందే భారత్ ట్రైన్ స్వాగతం పలికి ట్రైన్ ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. వారానికి ఆరు రోజులు సికింద్రాబాద్ వైజాగ్ మధ్య నడిచే వందే భారత్ ట్రైన్ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేవలం వరంగల్ స్టేషన్ లో మాత్రమే స్టాప్ ఉంది.. మహబూబాబాద్, జనగామ స్టేషన్ లలో నిలిచేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.