వరంగల్ లో నిరుద్యోగుల మార్చ్
ఈనెల 15న నిర్వహించే సభను విజయవంతం చేయాలని ఈటెల. పిలుపు

వరంగల్
టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ , నిరుద్యోగ సమస్యపై బీజేపీ పోరుబాటకు సిద్ధమైంది. పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు నుంచి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. ఈనెల 15న వరంగల్ లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించే పనిలో కమలనాథులు నిమగ్నమయ్యారు. సీఎం కెసిఆర్ చిక్కుకున్న విష వలయాల నుంచి బయటపడేందుకు పన్నిన పన్నాగంలో భాగమే టెన్త్ క్లాస్ పేపర్ లీక్ అనేది కేసిఆర్ మోసమని చాటి చెప్పాలని నిర్ణయించారు.
పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతుండగా బిజెపి ఆ అంశాన్నే ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు సిద్దమయింది. ఈనెల 15న నిరుద్యోగ మార్చ్ వరంగల్ లో నిర్వహించాలని నిర్ణయించి హన్మకొండ లో సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు హాజరై నిరుద్యోగ మార్చ్ సక్సెస్ పై చర్చించారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే ఈటల రాజేందర్, నిరుద్యోగ మార్చ్ నిర్వహణ కమిటీ చైర్మన్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విశ్వాసంపై, వ్వవస్థపై దెబ్బకొట్టాడని ఆరోపించారు. చదువుకుంటే నౌకరి వస్తుందని భావించే విద్యార్థుల కళ్ళలో మట్టి కొట్టిండని విమర్శించారు. పైరవీలకే డబ్బులకే, బ్రోకర్లకే నౌకర్లు వస్తాయని కేసిఆర్ నిరూపిస్తున్నారని ఆరోపించారు. ప్లాన్డ్ గా కుట్రపూరితంగా టిఎస్పీఎస్సీ ఆరు పేపర్ లు లీక్ చేశారని ఇంత దారుణమైన పరిస్థితి దేశ చరిత్రలో ఎక్కడ లేదన్నారు.
ప్రభుత్వ కుట్రను ప్రజల్లోకి పకడ్బందీగా తీసుకువెళ్ళాలని ఈటెల రాజేందర్ కోరారు.
ఒక్క సమస్యకు మొత్తం వ్వవస్థను మార్చగల శక్తి ఉంటుందని, మనం నిర్వహించే నిరుద్యోగ మార్చ్ అందుకు నాంది కావాలని ఆకాంక్షించారు. 30 లక్షల మంది నిరుద్యోగులు అంటే గంభీరమైన సమస్య కాబట్టి ఆషామాషీగా కాకుండా సీరియస్ గా తీసుకుని పులికేక వరంగల్ నుంచే చేయాలని సూచించారు.నిరుద్యోగ మార్చ్ సక్సెస్ కై మండలాల వారీగా ఇన్చార్జిలను నియమించి క్షేత్రస్థాయిలో కెసిఆర్ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ కావాలని నిర్ణయించారు.
.