సంజయ్ కు సవాలు విసిరిన సీపీ రంగనాథ్
ఆదారాలతోనే సంజయ్ పై కేసు నమోదు చేశాము

బిజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పోలీసులను టార్గెట్ చేశారా?..పేపర్ లీక్ కేసు అటెన్షన్ ను డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందా?..బిఆర్ఎస్ బిజేపి మద్య నెలకొన్న రాజకీయ వివాదంలో పోలీసులు వేధికగా మారారా?..ఖాకీలు వర్సెస్ కమలదళం అన్నట్లు పోరు సాగుతుందా… అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తే ఔననే సమాధానం వస్తుంది. బండి సంజయ్ పై ఐపిఎస్ ఆపీసర్ వరంగల్ పోలీస్ కమీషనర్ ఏవి రంగనాథ్ ప్రెస్ మీట్ పెట్టడం చూస్తే అందుకు నిదర్శనం అనిపిస్తుంది. వరంగల్ సీపీ ప్రేస్ మీట్ పై ప్రత్యేక. కథనం
హన్మకొండ జిల్లా కమలాపూర్ లో టెన్త్ పేపర్ లీక్ కేసు రాజకీయ దూమారం రేపుతుంది. ఖాకీలు వర్సెస్ కమలదళం అన్నట్లు సాగుతుంది. ప్రభుత్వంతోపాటు బిఆర్ఎస్ నేతలు కుట్ర పూరితంగా బిజేపి రాష్ట్ర రథసారధి పేపర్ లీక్ చేశారని ఆరోపిస్తుంటే బండి సంజయ్ మాత్రం ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వం, పోలీసులు అక్రమ కేసులు పెట్టి జైల్ కు పంపారని ఆరోపిస్తున్నారు. బిఆర్ఎస్ బిజేపి మద్య ఆరోపణలు ప్రత్యారోపణలు సాగుతున్న నేపద్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు సైతం స్పందించి వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. బండి సంజయ్ వ్యక్తిగతంగా తనపై చేసిన ఆరోపణలు బెదిరిస్తున్నట్లుగా ఉన్నాయని వరంగల్ సిపి రంగనాథ్ తెలిపారు. అక్రమ అస్థులు కూడబెట్టినట్లు నిరూపిస్తే ఉద్యోగం వదిలేస్తానని స్పష్టం చేశారు. బండి సంజయ్ పరువు నష్టం కేసు వేస్తే ఆధారాలతో ఎదుర్కొంటామన్నారు. ఉద్యోగంలో చేరినప్పుడే ప్రమాణం చేశానని రాజకీయాలకు అతీతంగా ఉద్యోగం చేస్తున్నామని తెలిపారు. బండి సంజయ్ కోరినట్లు ప్రమాణం చేయాల్సి వస్తే ఇప్పటికే పదివేల సార్లు ప్రమాణం చేయాల్సి ఉంటుందన్నారు. అశాస్త్రీయమైన ప్రమాణాలు చేయాలా అని సిపి ప్రశ్నిస్తున్నారు.
కమలాపూర్ లో పేపర్ లీక్ కాలేదని.. మాల్ ప్రాక్టిస్ క్రిందనే కేసు నమోదు చేశామని స్పష్టం చేసిన సిపి రంగనాథ్, ఈ కేసు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా ఉందన్నారు. విచారణ లో వాస్తవాలు తెలిసే సరికి కేసు తీరు మారుతుందని తెలిపారు. బండి సంజయ్ ఫోన్ తమ వద్దకు రాలేదని స్పష్టం చేశారు. కరీంనగర్ పోలీసులు సంజయ్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత అర్థరాత్రి ఒంటిగంట 14 ని.లకు బెజ్జంకి టవర్ పరిధి లో ఫోన్ స్విచ్చాఫ్ అయిందని తెలిపారు. అనవసరంగా అక్రమంగా సంజయ్ పై కేసు పెట్టలేదని తగిన ఆధారాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. బండి సంజయ్ ని తన బాధితులు సంప్రదించారంటే సంప్రదించినవారిలో ల్యాండ్ మాఫియా, లోఫర్, డాఫర్, చీటర్స్, పిడి యాక్ట్ బాదితులై ఉంటారని తెలిపారు. తప్పు చేసినవాడిని శిక్షిస్తే ఆరోపణలు చేయడం సహజమన్నారు. అక్రమ దందాలు చేసేవారిని తాను క్షమించనని స్పష్టం చేశారు. బండి సంజయ్ కేసును రాజకీయంగా చూడవద్దని విజ్ఞప్తి చేశారు
తన ట్రాక్ రికార్డు చూస్తే ఏలాంటి వాడినో తెలుస్తుందన్నారు సిపి రంగనాథ్. ప్రతిరోజు 50 నుంచి 60 గ్రీవెన్స్ చూస్తానని తెలిపారు. తాను ఏ సెటిల్ మెంట్ దందాలు చేయను… చేసే వాడిని క్షమించనని స్పష్టం చేశారు. బండి సంజయ్ కేసు విషయంలో సాక్షాలు సెకరించి చట్టపరంగా చర్యలు చేపడుతామన్నారు. అనివార్యమైన పరిస్థితిలోనే ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పిన సీపి, తన ప్రెస్ మీట్ పై సంజయ్ లేదా మరెవ్వరైనా స్పందిస్తే ఇక తాను స్పందించబోనని స్పష్టం చేశారు. విచారణకు ఆటంకం కలిగించేలా ప్రవర్తిస్తే బెయిల్ కండిషన్ ను ఉల్లంఘించినట్లే అవుతుందన్నారు. సెంటిమెంట్ కు చట్టాలను ముడిపెట్టవద్దని కోరారు. చట్టం తనపని తాను చేస్తుందని సిపి రంగనాథ్ స్పష్ట చేయడంతో మరి బిజేపి నేతలు బండి సంజయ్ ఏలా స్పందిస్తారోనని ఆసక్తిగా జనం చర్చించుకుంటున్నారు.
–