వరంగల్ సీపీ రంగనాథ్ అబిమానుల అందోళన
బండి సంజయ్ ఆరోపణల పై సీపీ అభిమానుల అందోళన

వరంగల్
వరంగల్ సీపీ రంగనాథ్ అభిమానులు అందోళన. చేపట్టారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ పై ఆరోపణలు చేయడం పట్ల సిపి అభిమానులు ఆందోళనకు దిగారు. పోలీసులకు రాజకీయ రంగు పులుమద్దని బ్యానర్ ప్రదర్శిస్తూ బండికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ల్యాండ్ మాఫియా పై ఇటీవల సిపి చేపట్టిన చర్యలతో న్యాయం జరగడంతో పదిమంది సిపి కి అభిమానులుగా మారి బండి సంజయ్ ఆరోపణలను ఖండించారు. నిజాయితీకి నిలుపుటద్దం… మాలాంటి అభాగ్యుల హృదయాల్లో గూడుకట్టుకున్న దేవుడని సిపిని కొనియాడారు. నిజాయితీగా పనిచేసే సిపి పై ఆరోపణలు చేసిన బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.