ఖమ్మం పోటీకి సై…. గుడివాడకు నేనేనంటున్నా రేణుకా చౌదరి
రెండు రాష్ట్రాలలో పోటీ చేస్తానంటున్నా మాజీ ఎంపి

ఎన్నికల యుద్దానికి సై అంటోంది.. ఖమ్మంలో కాలు దువ్వుతోంది… ఆంధ్రాలో పోటీ సిద్దమంటోంది..మాజీ ఎంపీ రేణుకచౌదరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియక ఆమె అనుచరులు అయోమయంలో ఉన్నారా? …ఖమ్మం అసెంబ్లీ నుంచి చేస్తారా లేక ఏపీ లోని గుడివాడ నుంచి చేస్తారో తెలియక గందరగోళంలో ఉన్నారా?… ఈ గందరగోళంకు కారణం ఆమె చేస్తున్న ప్రకటనలేనా?…వచ్చే ఎన్నికల్లో రేణుక చౌదరి దారి ఎటుకాబోతుంది…. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు తలపిస్తున్న ఖమ్మం ఫైర్ బ్రాండ్ రేణుక చౌదరి పై ప్రత్యేక కథనం
.. ఖమ్మం జిల్లా లో సీనియర్ నాయకురాలు మాజీఎంపీ రేణుకచౌదరి వచ్చే ఎన్నికల్లో యాక్టిివ్ అయ్యేందుకు గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టింది…కార్యకర్తల తో సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు…ఇటీవలే ఖమ్మంలో క్యాంపు కార్యాలయంను కూడా ప్రారంభించారు…ఖమ్మం అసెంబ్లీ నుంచి రేణుక చౌదరి పోటీ చేయబోతున్నారనే ప్రచారం సైతం గత కొంతకాలంగా జరుగుతూ వస్తోంది…ఇదే సమయం లో రేణుకా చౌదరి సైతం చేస్తే చేయవచ్చు అన్న సంకేతాలను సైతం ఇచ్చారు .. అంతే కాదు ఖమ్మం కాంగ్రెస్ అడ్డా అని ఇక్కడ ఏ పార్టీల మనుగడ ఉండదని ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలో 10స్థానాలు గెలుస్తామని చెప్పుకొచ్చారు రేణుక చౌదరి… అధికార పార్టీ ప్రజాప్రతినిదులను ఉద్దేశించి ఘాటుగానే కౌంటర్లు ఇస్తు వస్తున్నారు…రేణుక చౌదరి పోటీ చేస్తే ఖమ్మం జిల్లా లో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంటుందని ఆమె అనుచరులు కానీ కాంగ్రెస్ శ్రేణులు సైతం ఆశాబావం వ్యక్తం చేస్తూ వస్తున్నారు …
..
.సిన్ కట్ చేస్తే రేణుక చౌదరి అవసరం అయితే గుడివాడ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తాననే ప్రకటనలు ఇస్తు ఉండటంతో ఆమె అనుచరులు అయోమయంలో ఉన్నారనే గుసగుసలువినిపిస్తున్నాయి…అసలే ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఈ ప్రకటనలు ఎందని తలలు పట్టకుంటున్నారట… అసలు ఖమ్మంలో ఉంటారా లేక ఏపీ కి షిఫ్ట్ అవుతారా అన్న గందరగోళం వారిలో కనిపిస్తుందట.
ఎన్నికల సమయానికి ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశాలు సైతం లేకపోలేదంటున్నారు..
.ప్రస్తుతం ఖమ్మం జిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి …రాష్ట్ర రాజకీయాలు సైతం ఖమ్మం వైపు చూస్తున్నాయి ..బీఆర్ ఎస్ పార్టీ సైతం ఖమ్మం ను సీరియస్ గా తీసుకొని గ్రౌండ్ వర్క్ చేస్తుంది …ఆవిర్భావ సభ ను సైతం ఇక్కడనే నిర్వహించింది… మరో వైపు బిజెపి సైతం ఆపరేషన్ ఖమ్మం చేపట్టింది .. కీలక నేతలు రంగంలో దిగి చర్చలు జరుపుతున్నారు …బీఆర్ ఎస్ లోని అసంతృప్తి నేతలను చేర్పించుకోవడంలో బిజీగా ఉంది…ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్తితితుల్లో రేణుక చౌదరి ప్రకటనలు జిల్లా లో పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు సైతం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు…అసలే ఖమ్మం లో కాంగ్రెస్ కు కేడర్ బాగానే ఉన్నా నడిపించే బలమైన నేతలు లేకపోవడం తో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు…ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యం లో అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా ప్రకటనలు చేస్తున్న రేణుక చౌదరి చివరికి ఎక్కడినుంచి పోటీ చేస్తారో చూడాలి…