ఆదిలాబాద్ జిల్లాలో అదివాసీ మహిళ పటేల్ పాలన
ముప్పై ఎళ్లుగా పాలన సాగిస్తున్నా అదివాసీమహిళ పటేల్

ఆమే అదివాసీ రాణి… రాణి దుర్గావతిలా… ఇందిరా గాందీ లా ఎలుతోంది… పటేల్ గా పాలన సాగిస్తోంది… గిరిజన గూడేం రాతను మార్చుతోంది… అభివృద్ధి,తో ప్రజల. దిశను మార్చుతోంది.. అదివాసీ గూడేంలో ఆదర్శవంతమైన పాలన సాగిస్తున్నా అదివాసీ మహిళ పటేల్ పై ప్రత్యేక కథనం
. అదివాసీ గూడాలలో పటేల్ పదవి… అత్యున్నతమైన పదవి.. దేశంలో ప్రదాని పదవి ఎంత శక్తివంతమైందో… అదివాసీ గూడాలలో పటేల్ పదవికి కూడ అదేస్థాయిలో గౌరవం ఉంటుంది… ప్రాధాన్యత ఉంటుంది… అలాంటి ఆ పదవిని అదివాసీలు అత్యంత గౌరవంగా బావిస్తారు
.. ఇంతటి గౌరవమైనా పదవిని మగవాళ్లు చేపట్టడం తప్ప.. మహిళలు పటేల్ పదవి చేపట్టడం..అరుదు…అలాంటి అరుదైన గౌరవమైనా పదవిని చేపట్టి ముప్పై ఏళ్లుగా ఎలుతున్నారు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ. మండలం దుబార్ పెట్ గూడెం కాత్లే శశికళ బాయి… మూడు దశబ్దాల క్రితం శశికళ భర్త అనారోగ్యం తో ప్రాణాలు కోల్పోయారు.. భర్త ప్రాణాలు కోల్పోవడంతో పటేల్ పదవిబాద్యతలు శశికళ. చేపట్టింది.
. పటేల్ పదవి చేపట్టడం మాటలు కాదు… సవాలు కూడిన. పదవి… అదివాసీ గూడాలలో తీసుకునే ప్రతి నిర్ణయం పటేల్ దే నిర్ణయం అంతిమం…పండుగల నుండి పంచాయితీల వరకు పటేల్ నిర్ణయం తీసుకుంటే సుప్రీం కోర్టులా బావిస్తారు…ఆనిర్ణయాన్ని గూడేం ప్రజలందరు కచ్చితంగా పాటిస్తారు…
. అంతటి అత్యన్నతమైనా పదవి చేపట్టిన. శశికళ గూడేం అభివృద్ధి లో కీలకపాత్ర వహిస్తున్నారు.. అందరికి అదర్శంగా నిలుస్తున్నారు..గూడేం లో ఎ చిన్న. సమస్యవచ్చిన ముందుండి సమస్యలను పరిష్కరిస్తున్నారు.. ప్రజల కష్టాలు సుఖాలలో తోడుగా నిలుస్తున్నారు..భార్య, భర్తల సమస్యలు వస్తె చాలు…అక్కడిక్కడే పరిష్కరిస్తున్నారు పటేల్ శశికళ
శశికల పటేల్ గా గ్రామంలో. వివాదాలను పరిష్కరిస్తున్నారు…అభివృద్ధి తో గ్రామరూపు రేఖలు మారుస్తున్నారు…పదవి పటేల్ చేపట్టడం అరుదైనా గౌరవంటున్నారు.. మొదట్లో పదవి చేపట్టిన ముగ్గురు చిన్నపిల్లలు ఉండటం, కుటుంబ పోషణతో బారం తనపై ఉండటంతో ఇబ్బందులు పడ్డానని… ఆ తర్వాత. ఏలాంటి ఇబ్బందులు లేకుండా పాలన. సాగిస్తున్నాని ఆమే సంతోషం వ్యక్తం చేస్తున్నారు..
.. మహిళ పటేల్ గా స్పందిస్తున్నా తీరు ప్రజలను అకట్టుకుంటోంది..పటేల్ గా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారని… అదేవిధంగా గూడాన్ని అభివృద్ధి లో ఇతర. గ్రామాలతో పోల్చితే. అందరికంటే ముందున్నారని శశికళ పటేల్ గ్రామస్థులు మెచ్చుకుంటున్నారు