అదివాసీలకు ఎండ్ల బండ్లే అంబులేన్సులు

అసుపత్రికి సకాలంలో వెళ్లలేక. అడవిలో ప్రసవిస్తున్నా అదివాసీ తల్లులు

ఆ ప్రాంతంలో సర్కార్ అసుపత్రులు‌లేవు…. .. దవ ఇచ్చే డాక్టర్లు ఉండరు… అంబులేన్సులు రావు.. కాన్పు కోసం అసుపత్రులకు వెళ్లాలంటే ఎండ్ల బండి అంబులెన్స్ లు. దిక్కు… అ ఎండ్లబండి అంబులెన్స్ లో అదివాసీ మహిళలు అసుపత్రికి వెళ్లుతున్నారు.. కోండలు , బండల మద్య ప్రయాణం సాగిస్తున్నారు…. సకాలంలో అసుపత్రికి చేరలేక మార్గమద్యలో అడవిలోనే ప్రసవిస్తున్నారు అదివాసీ తల్లులు..నరకాన్ని అనుభవిస్తున్నారు…. అదివాసీల తల్లుల కాన్పు కష్టాల పై ప్రత్యేక కథనం

. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి ఎడు దశబ్దాలు దాటింది..కాని నిర్మల్ జిల్లా పెంబి‌మండలం లో అదివాసీ గూడాల ‌దశ మారలేదు… దిశమారలేదు…‌‌ అణువుంతా అభివృద్ధి ‌లేదు…‌దారిద్రం తాండవిస్తోంది,. ‌ ఈ ప్రాంతంలో వసుపల్లి, దోందరా, పొతగూడ,చాకి రేవు వంటి. తోమ్మిది అదివాసీ గూడాలు ఉన్నాయి .వీటిలో మూడున్నర. వేలమంది అదివాసీలు ఎళ్లుగా నివాసం నివసిస్తున్నారు..

అడవులను అవాసంగా నివసిస్తున్నా బిడ్డలకు రోడ్లు లేవు.. రోడ్లు‌లేక. అదివాసీ బిడ్డలు పడే కష్టాలు అన్ని కావు.. గూడేం బిడ్డలు ఆకలితీర్చుకోవడానికి నిత్యావసర సరుకుల కోసం బయటకు వెళ్లాలన్నా….అసుపత్రికి వెళ్లాలన్నా పడే పాట్లు అన్ని ఇన్ని కావు…

…ఇటీవల. దోందరి గూడానికి చెందిన. సునితకు అర్థరాత్రి పూట పురిటినోప్పులు వచ్చాయి.. డెలివరి కోసం ఆసుపత్రి తీసుకవెళ్లుదామంటే అంబులేన్స్ రాదు… ప్రసవం కోసం తల్లడిల్లుతున్నా సునిత.ను తీసుకోని ఎండ్ల బండి పై పెంబి అసుపత్రికి బయలు దేరారు. అసుపత్రికి వెళ్లేమార్గంలో.దట్టమైన అడవులున్నాయి …‌‌‌ అడవిలో రాళ్లు రప్పలు,బండలు ఎక్కతూ ,వాగులు దాటూ వెళ్లారు.. మద్యలో సునిత. పురిటి నోప్పులు మరింత తీవ్రమ్యాయి. ఆర్థరాత్రి పూట అడవిలో నోప్పులు తీవ్రం కావడంతో సునిత తల్లడిల్లింది…మాత్రుత్వం కల నేరవేరకుండా పోతుందని అందోళనకు గురైంది ఆ తల్లి … పోని డెలివరీ చేయడా‌నికి డాక్టర్ పిలుద్దామన్నా వచ్చే పరిస్థితి లేదు.. డాక్టర్లు అందుబాటులో లేని ప్రాంతం.. చివరకు అడవిలొనే ప్రసవించింది.. అక్కడే బాబుకు జన్మనిచ్చింది.. డెలివరైనా తర్వాత అతి కష్టం మీద అదే ఎండ్ల బండి పై రోడ్డు సౌకర్యం ఉన్న ప్రాంతానికి తరలించారు…‌అక్కడి నుండి మళ్లీ అంబులెన్స్ లో పెంబి అసుపత్రికి తరలించి తల్లి బిడ్డలకు వైద్యం అందించారు.. ఎండ్లబండిలో వెళ్లుతున్నా సమయంలో నోప్పులతో తల్లిడిల్లానని అందోళన వ్యక్తం చేశారు… ప్రాణాలు పోతాయనే భయం వెంటాడిందన్నారు… రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నా అదికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు

. ఈ ప్రాంతంలో తోమ్మిది గూడాలు ఉన్నాయి… వీటిలో ఎందరో గర్బీణీ‌ మహిళలు ఉన్నారు…పురుడుతో ప్రాణం పోయాలంటే..‌ తల్లులు ప్రాణం పోవాల్సిన దయనీయమైన పరిస్థితులున్నాయని అందోళన వ్యక్రం చేస్తున్నారు,. గతంలో ఒక. గర్బీణీ మహిళ. ప్రసవం కోసం ఎండ్ల బండి పై అసుపత్రికి వెళ్లారు..‌ కాని సకాలంలో అసుపత్రికి వెళ్లకపోవడంతో మద్యలోనే గర్బీణీ మహిళ ప్రాణాలు కోల్పోయిందని అంగన్ వాడి కార్యకర్త సరిత. అవేదన వ్యక్తం చేశారు.. గర్బీణీ మహిళలను అసుపత్రికి తీసుకవెళ్లడానికి ఎండ్లబండి తప్ప …. మరోక ప్రత్యామ్నాయం లేదంటున్నారు… రోడ్డు సౌకర్యం లేక ఈ ‌పరిస్థితి దాపురించిందంటున్నారు.. ఇప్పటికైనా సర్కారు స్పందించి దోంతివాగు పై బ్రిడ్జీ, రోడ్డు పై బ్రిడ్జి నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు

Leave A Reply

Your email address will not be published.