త్రాగు నీళ్లకోసం వెళ్లి బావిలో పడిన ముగ్గురు గిరిజన మహిళలు
తీవ్రంగా గాయపడిన. మహిళలను అసుపత్రికి తరలింపు

తాగడానికి నీళ్ల కోసం వెళ్లి బావిలో పడిన ముగ్గురు గిరిజన మహిళలు.. కుమ్రంబీమ్ జిల్లా జైనూర్ మండలం దేవుని గూడలో నీళ్ల తీసుకురావడానికి వెళ్లిన ముగ్గురు మహళలు బావిలో పడ్డారు. బావి వద్ద నీళ్లు తీస్తున్నాసమయంలో అడ్డంగా పెట్టిన కర్రలు విరిగిపోయాయి. అదే సమయంలో నీళ్లు తీస్తున్నా ముగ్గురు మహిళలు బావిలోనే పడిపోయారు బావిలో పడిలో . ముగ్గురు మహిళలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ఆత్రం జైతు బాయి, ఆత్రం సోంబాయి, సిడం ముత్తు బాయి కి గాయాలు అయ్యాయి. ఈముగ్గురిని చికిత్స కోసం జైనూర్ అసుపత్రికి తరలించారు,.. ఇప్పటికైనా అదికారులు స్పందించి త్రాగునీటి సౌకర్యం కల్పించాలని గిరిజనులు సర్కార్ ను కోరుతున్నారు