జాగా కోసం జాగరణ దీక్షలు చేస్తు‌న్నా అదివాసీలు

ఇండ్ల. స్థలాల కోసంపోరాటం సాగిస్తున్నా గిరిజనులు

 

. గూడుకోసం గూడేంబిడ్డల పోరు.. సర్కార్ స్థలంలో గుడిసేలు నిర్మించుకున్నారు.జాగా కోసం జాగరణ చేస్తున్నారు…. ఆ ప్రాంతంలో కరెంట్ లేకున్నా… కారు చీకట్లో ఉద్యమిస్తున్నారు.. సర్కార్ స్పందించకున్నా …. సౌలతులు కల్పించుకున్నా అదివాసీలు ఇంటి స్థలాల కోసం అదివాసీలు పోరాటం సాగిస్తున్నారు.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో అదివాసీబిడ్డల. గూడు కోసం పోరాటం పై ప్రత్యేక కథనం

 

వ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ని కొమురంబీమ్ కాలనిలో అదివాసీలు సర్కారు స్థలంలో గుడిసేలు నిర్మించుకున్నారు.. రెండు వేల మంది అదివాసీలు ఆ ప్రాంతంలో గుడిసేలు వేసుకున్నారు.. కుటుంబ సభ్యులు చిన్నపిల్లలతో ‌అక్కడే గుడిసేలలో ఉంటున్నారు.. పన్నెండు రోజులుగా తమకు ఇంటి స్థలాలు ఇవ్వాలని అడవి బిడ్డలు రిలే దీక్షలు చేస్తున్నారు గిరిజనులు‌‌.. పగటి పూట దీక్షలు చేస్తున్నారు. రాత్రిపూట. గుడిసేల్లో ఉంటున్నారు‌ ఏళ్లుగాతాము ఈ ప్రాంతంలో ఉంటున్నామని… అయినప్పటికీ పట్టాలు ఇవ్వడం లేదని వాపోతున్నారు..

పట్టాలు కోసం రోజు రోజుకు పోరాటాన్ని ఉద్రుతం చేస్తున్నారు… పోరాటం చేస్తున్నా అదికారులు స్పందించడంలేదు.. అయినప్పటికీ అదివాసీలు గుడిసేలు వేసుకున్నా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.. ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు ‌.ఆ ప్రాంతంలో కనీస వసతులు లేవు.. త్రాగడానికి నీళ్లు లేక, విద్యుత్ సౌకర్యం లేక అదివాసీలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు..

ఇబ్బందులు ఎన్నినైనా ఎదిరిస్తామంటున్నారు..కూలీ ‌ నాలీ జీవిస్తున్నామని.. సోంత ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు…కూలీ చేస్తే వచ్చే డబ్బులు కూడ అద్దేలు కట్టడానికి సరిపోతున్నాయని గిరిజనులు వాపోతున్నారు..అద్దేలు బారంగా మారాయని అవేదన వ్యక్తం చేస్తున్నారు.. తమకు ఇంటి‌స్థలం ఇచ్చేంత వరకు ఇక్కడి నుండి కదలమంటున్నారు అదివాసీలు.. ప్రాణంపోయినా పర్వాలేదు..కాని ఇంటి జాగా ఇచ్చేదాకా వెళ్లమంటున్నారు అదివాసీలు..

.. అదివాసీలు ఇంటి స్థలం కోసం పోరాటం చేస్తున్నా ప్రాంతం అడవిని మరిపిస్తోంది‌‌‌ .. విద్యుత్ సౌకర్యం లేదు..‌కరెంట్ లేకున్నా.. గుడ్డి దీపాల క్రింద. ఉంటున్నారు‌‌‌..కటిక నెల పై పడుకుంటున్నారు.. చీకట్లో ‌ పనులు చేసుకోవడానికి అనేక. అవస్థలు పడుతున్నామని మహిళలు వాపోతున్నారు.. చీ‌మ్మ. చీకట్లోనే తింటున్నారు.‌‌పడుకుంటున్నారు.. దోమలు బారిన పడి రోగాల పాలవుతున్నామని అంటున్నారు.. అదేవిధంగా పాములు గుడిసేలలో చోరబడుతున్నాయని భయపడుతున్నారు.. పాములు ప్రాణాలు తీస్తాయని అదివాసీలు అందోళన చెందుతున్నారు.. ఇన్నికష్టాల మద్య ఇండ్ల స్థలాల కోసం పోరాటం అదికారులు పట్టించుకోవడం లేదని అదికారుల తీరు పై అదివాసీలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. వెంటనే సమస్యను పరిష్కరించాలని అదివాసీలు డిమాండ్ చేస్తున్నారు..

Leave A Reply

Your email address will not be published.