పిల్లల పెళ్లిళ్లు చేయలేని స్థితిలో అదివాసీ పత్తి రైతులు

రైతులు చేతిలో పైసలు లేక పిల్ల పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నా గిరిజన రైతులు

.. పసిడి లాంటి పత్తిని ‌ పండించారు‌.. గిట్టుబాటు ధరలేక. దిక్కులు చూస్తున్నారు‌‌… దుంఖంతో తల్లడిల్లుతున్నారు.. కోనుగోళ్లు లేక కోటలా ఇండ్లలో పత్తి నిల్వలు పెట్టారు‌. కోనుగోల్ల కోసం ఆశ గా ఏదురు చూస్తున్నారు అదివాసీ బిడ్డలు…. పత్తి పండితే పండుగ చేసేకునే అదివాసీలు…అమ్మకాలు జరగక. అదివాసీ బిడ్డల చేతిలో అణా పైసా‌ లేదు…‌ పైసలు లేక పండుగలు లేవు…పిల్లల పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ‌పత్తి రైతుల. సంక్షోభం పై ప్రత్యేక కథనం

. అదివాసీలకు కాటన్ పంటను కాంతులు ‌ నింపుతోంది… ఎళ్లుగా పత్తిని సాగు చేస్తున్నారు… గిరిజన రీతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి‌‌ వచ్చింది… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంటతోనే అదివాసీలు జీవనం సాగిస్తున్నారు..

.‌. అలాంటి కాంతులు నింపాల్సిన. పంట… పత్తికి గిట్టుబాటు ధర లభించక. గిరిజన చీకట్లను ‌ నింపుతోంది…. చేతికి వచ్చిన. పంటను అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర లభించడం లేదు… ప్రతి సంవత్సరం డిసెంబరు నాటికి పత్తి అమ్మకాలు . పూర్తయ్యేవి…. ఈసారి పరిస్థితి తారుమారైంది… కుండపోత వర్షాల వల్ల పంటలకు బారీగా నష్టం సంబబించింది.. పైగా పంటలకు రోగాలు రావడం తో పెట్టుబడి వ్యయం పెరిగింది… అప్పులు తెచ్చి రోగాలను పారద్రోలడానికి వేల రుపాయలు ఖర్చు చేశారు.. పైగా వర్షాలు,రోగాల వల్ల దిగుబడి పడిపోయింది… పోని పండిన కాటన్ కు గిట్టుబాటు ధర లబిస్తుందంటే అదిలేదు..

…‌ పత్తి క్వింటాల్ కు ఎడు వేల నుండి ఎనిమిది వేలు మించడంలేదు… పెట్టుబడి వ్యయం బారీగా పెరగడంతో గిట్టుబాటు ధర కోసం రైతులు ఆశలు పెట్టుకున్నారు‌.‌గత ఎడాది పత్తికి బారీగా ధర పలికింది… పదమూడు వేలు, పన్నేండు వేలకు క్వింటాళ్ పత్తిని కోనుగోలు చేశారు వ్యాపారులు.. అదే ఆశతో రైతులు పత్తిని అమ్మకుండా ఇండ్లలో నిల్వ చేశారు..‌ కనీసం పండిన పత్తిలో ఇప్పటి వరకు పదిశాతం కూడ అమ్మలేదు.. దాంతో గిరిజన గూడాలలో ఏ ఇల్లును చూసిన. ఇంటి నిండా నిల్వ ఉంచిన. పత్తి కనిపిస్తోంది..

.. అయితే ధరలు పెరుగుతాయని పెట్టుకున్నా ఆశలు తలక్రిందులయ్యాయి.. ధరలు లేకపోవడం తో పత్తి అమ్మడంలేదు… అయితే పంట పెట్టుబడి కోసం అప్పు ఇచ్చిన వడ్డి వ్యాపారులు అప్పులు కట్టాలని వేదిస్తున్నారని రైతు అత్రం భీమ్ రావు అవేదన వ్యక్తం చేస్తున్నారు.. అప్పులు తీర్చడానికి భూములను, ఎండ్లను అమ్మాల్సిన దయనీయ పరిస్థితులు ఉన్నాయని ఆయన వాపోయారు

 

.. మరోవైపు అదివాసీ బిడ్డలు… పత్తి పంట. చేతికి వచ్చిందంటే చాలు… సంబరాల. జాతరలు నిర్వహిస్తారు‌.‌‌ తమ పెళ్లి ఈడుకు వచ్చిన. యువతి ,యువకులకు పెళ్లిల్లు చేస్తారు… పెళ్లి వేడుకలు, దేవుళ్ల. జాతరలతో ఇప్పుడు గూడాలు మారుమ్రోగుతాయి.. ఈసారి పరిస్థితులు కనిపించడంలేదు…గూడాలలో సంబరాల జాడలేదు… కోందరైతే పెళ్లిలు నిర్వహించడానికి డబ్బులు లేక. వాయిదాలు చేసుకుంటున్నారు… ఆర్థికంగా వేసులుబాటు లేదని అందువల్లనే కన్న బిడ్డల పెళ్లిలు తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చే సంవత్సరం చేస్తామని చెబుతున్నారు.. అప్పులు చేసి పెళ్లి చెద్దామంటే పైసలు పుట్టని పరిస్థితులు ఉన్నాయంటున్నారు

 

. గిట్టుబాటు ధర లబించక తమ పరిస్థితి దారుణంగా మారిందని అందోళన వ్యక్తం చేస్తున్నారు.. కనీసం క్వింటాల్ పత్తిని పన్నెండు వేలకు కోనుగోలు చేస్తే తప్ప… తమ పరిస్థితి మారందంటున్నారు… అంతర్జాతీయ‌ స్థాయిలో పత్తికి ధరలు ఉన్నా… ఇక్కడ వ్యాపారులు గిట్టుబాటు ధర ఇవ్వడంలేదని రైతులు అందోళన వ్యక్రం చేస్తున్నారు.. వ్యాపారుల. తీరు పై రైతులు మండిపడుతున్నారు

Leave A Reply

Your email address will not be published.