అటవీ అదికారుల జీబు ప్రక్కన పులి ప్రత్యక్షం

పులి ప్రత్యక్షంతో ఉల్కిపడిన. అటవీ అదికారులు

.తిరుగబడుతున్నా పులులు… అటవీ అదికారులకు అడ్డం తిరుగుతున్నా పులులు.. అటవీ అదికారుల. వాహనం దగ్గరకు దూసక వచ్చిన పులులు… మరిఅప్పుడు అటవీ అదికారులు ఏం చేశారు..‌ఏలా తప్పించుకున్నారు.. ఆదిలాబాద్ జిల్లాలో అటవీ అదికారులకు ఎదురు తిరుగుతున్నా పులులపై  ప్రత్తేక కథనం

 

.‌ఆదిలాబాద్ జిల్లాలో పులులు మంద. సంచరిస్తోంది.. మహరాష్ట్ర లో తిప్పేశ్వరం అభయారణ్యంలో పులులు అక్కడి నుండి సరిహద్దులు దాటుతున్నాయి… అభయారణ్యం నుండి నాలుగు పులులు పెన్ గంగాననదిని దాటాయి…‌ఆ నాలుగు పులుల మంద. ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించింది.. తాంసి, బీమ్ పూర్, తలమడుగు మండలాల్లో సంచరిస్తున్నాయి..

 

. ఈ ప్రాంతంలో పులుల సంచారం ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది… పరిసర ప్రాంతాల రైతులు పంటపోలాలకు వెళ్లితే చాలు.. ఎదురు తిరుగుతున్నాయి… పిప్పల్ కోటి రిజర్వాయర్ పరిసర ప్రాంతంలో ప్రతి నిత్యం రైతులకు కనిపిస్తున్నాయి. పంటపోలాల చుట్టుతిరుగుతున్నాయి

. పంటపోలాల వద్ద పులులు సంచరిస్తున్నాయి.. ఒక తల్లి పులి, మూడు సంవత్సరం వయస్సున్నా పులులు చూసి రైతులు వణుకుతున్నారు.. పంటపోలాలకు వెళ్లితే తమపై పులులు పంజావిసురుతాయని రైతులు భయపడుతున్నారు‌.ఆ భయంతోనే రైతులు పంటపోలాల వైపు అడుగులు పెట్టడంలేదని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు

.. పులులు ‌ సంచరిస్తుండటంతో అటవీ అదికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు…పులులు ప్రజల పై దాడులు చేయకుండా.అదేవిధంగా పులులు వేటగాళ్ల బారిన పడకుండా చర్యలు చేపడుతున్నారు‌.‌ఈ పక్రియ లో భాగంగా పులులపై గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.. డబ్బులతో చాటింపు చేయిస్తున్నారు.. పంటపోలాలకు వెళ్లిన వాళ్లు సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి రావాలని హెచ్చరికలు జారీ చేశారు.. అదేవిధంగా పులుల అనవాళ్లను పరిశీలించడానికి గంజాల్ అటవీ ప్రాంతంలోకి ‌జీబులో వెళ్లారు.. ఈ సందర్భంగా వాహనం దిగారు.. పులుల అనవాళ్లు గుర్తించడానికి ముప్పై మీటర్ల దూరం వెళ్లారు…ఇంతలో అటవీ అదికారుల దిగిన వాహనం వద్ద పులి ప్రత్యక్షమైంది… ఒక్కసారి పులి వద్ద వాహనానికి అతీ సమీపంలో పులి రావడం పై అటవీ అదికారులు ఉల్కిపడ్డారు.. ఈ సందర్భంగా వాహనం వద్దకి వెళ్లుదామంటే వెళ్లలేని పరిస్థితి… పోని అక్కడి నుండి కదులుదామంటే మరో మూడు పులులు అదే ప్రాంతంలో సంచరిస్తున్నాయి.. దాంతో ముందు కదిలినా.. వెనక్కి వచ్చిన ముంపు తప్పదని అదికారులు కోద్ది సేపు అక్కడే అగారు.. ఆర గంట తర్వాత పులి అక్కడ నుండి వెళ్లిపోయింది… పులి వాహనం సమీపం నుండి వెళ్లడంతో అటవీ అదికారులు ఊపీరి పీల్చుకున్నారు

Leave A Reply

Your email address will not be published.