గడ్చిరోలిలో వ్యవసాయశాఖ నర్సరీలో చోరబడిన పులి
ఆరు గంటలపాటు శ్రమించి పులిని బందించిన. అటవీ అదికారులు

మహరాష్ట్ర
గడ్చిరోలి నగరంలోని రద్దీ ప్రాంతంలో వ్యవసాయ శాఖ నర్సరీలో ఓ పులిని బంధించారు. ఈ ప్రాంతానికి ఆనుకుని ఉన్న అడవి నుంచి పులులు ప్రవేశించింది. అక్కడ పనిచేసే కనిపించింది.. పులి కనిపించడంతో ప్రాణభయంతో వణిలిపోయారు .. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చంద్రాపూర్‌కు చెందిన తడోబా-అంధారి టైగర్ ప్రాజెక్ట్ రెస్క్యూ టీమ్‌తో పాటు స్థానిక బృందం కూడా పులికి మత్తుమందు ఇచ్చే పనిని అప్పగించింది. అటవీ శాఖ బృందం ఆపరేషన్ నిర్వహించి పులిని బంధించి మత్తు ఇంజక్షన్ ఇచ్చి బోనులో బంధించారు. బందీ అయిన పులి ప్రాథమిక స్క్రీనింగ్ తర్వాత తెలియని ప్రదేశానికి తరలిస్తామంటున్నారు అటవీ అదికారి మిలిష్ శర్మ. పులిని చూసేందుకు జనం గుమిగూడారు. ఒక రోజంతా సాగిన విజయవంతమైన ప్రచారం కారణంగా స్థానికులు, అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకోగలిగారు.