అనుబందాల జాతర జరుపుకున్నా గ్రామస్తులు

ముంపుకుగురైనా గ్రామాన్ని నలబై ఎళ్ల తర్వాత. సందర్శించిన గ్రామస్తులు

ప్రాజేక్టును ముంచింది… ‌ ఆ ముంపులో సర్వం కోల్పోయారు.. అనుబందాలకు దూరమయ్యారు.. చెట్టుకోకరుపుట్టోకరయ్యారు‌.. కాని మళ్లీ అమ్మ లాంటి పల్లేగుర్తుకువచ్చింది.. అందరు నాలుగు దశాబ్దాల తర్వాత ఊరుకు చేరుకున్నారు..పాతజ్నాపకాలను నేమరువేసుకోని మురిసిపోయారు..దాహం తీర్చిన బావి..గూడునిచ్చిన ఇండ్లను చూసి ఆనందంతో ఉప్పోంగిపోయారు.‌‌‌ ఆ ఆనందంతో అడారు …ఆదిలాబాద్ జిల్లా తోయగూడలో గ్రామస్తుల‌ అనుబందాల జాతర పై ప్రత్యేక కథనం ‌

ఆదిలాబాద్ జిల్లా బేల మండలం తోయగూడగ్రామం సాత్నాల ప్రాజెక్టు ముంపుకుగురైంది… ఊరు ముంపులు గురికావడంతో చెట్టుకోకరు, పుట్టకోకరయ్యారు,..ఉన్న ఊరును ,తాత‌ముత్తాతలు సంపాదించిన అస్తులను వదిలివెళ్లిపోయారు‌.

కాని ఊరు వదిలి వాళ్లంతా… మళ్లీ ఊరు చూడాలని నిర్ణయించుకున్నారు..‌ అందులో బాగంగా చెల్లచెదురైనా వారంతా నాలుగు దశాబ్దాల గ్రామానికి చెరుకున్నారు‌.. నీడ చెట్టును, గూడునిచ్చిన పాత ఇండ్లను.. దాహం తీర్చిన బావి చూసి మురిసిపోయారు.. ఆ బావి, పాత ఇండ్ల వద్ద పోటోలు తీసుకున్నారు…సెల్పీ దిగారు..నాలుగు దశాబ్దాల తర్వాత. అందరు ఒకచోట చేరడంతో పండుగ చేసుకున్నారు..గతంలో వారు ఆడుకున్న చోటే మళ్ళి అడారు,రోజు దర్శించుకున్నారు… డప్పు వాయిద్యాలకు అందరు వయస్సును మరిచిపోయిన చిందులు వేశారు..మదుర. జ్నాపకాలను గుర్తుచేశారు‌.. ఒకప్పటి ఊరంతా ఒక్క చోటికి చేరడంతో గ్రామస్తుల ఆనందానికి అవదులులేకుండా పోయిందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు..‌ఒకరి కష్ట సుఖాలను మరోకరు తెలుసుకోని అనుబందాలను పంచుకున్నారు.‌ ..ఇలా అనుబందాల. జాతర జరుపుకున్నా గ్రామస్తులను ఇతరులు స్పూర్తిగా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

Leave A Reply

Your email address will not be published.