కేటిఅర్ ఇలాకలో ‌ మున్సిపల్ ఉద్యోగుల సమ్మే

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

: రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
సిరిసిల్ల మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. సమ్మె కోసం 15 రోజుల క్రితమే.. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కు నోటీస్ ఇచ్చిన కార్మికులు.. 2021 జూన్ లో పెరిగిన పీఆర్సీ, ఏరియర్స్ ఇవ్వాలన్న డిమాండ్లను మున్సిపల్ కమిషనర్ ముందుంచారు. అలాగే, పీఎఫ్ పెండింగ్ సమస్యలుతీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మెతో స్వచ్ఛ మున్సిపాలిటీకి కేరాఫ్ గా కనిపించాల్సిన మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ఇలాకా సిరిసిల్లలో.. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. కార్మికులు వెళ్లి వివరణ కోరినా దాటవేసిన మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకార్మిక నాయకులతో చర్చలు జరుపుతున్నారు

Leave A Reply

Your email address will not be published.