సమ్మక్క సారలమ్మ. గద్దేల వద్ద నుండి రేవంత్ పాదయాత్ర ప్రారంభం

భద్రాద్రి నుండి ములుగు కు మారిన. రేవంత్ పాదయాత్ర

ములుగు..అదివాసీల.వనదేవతల గద్దేల నుండి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ పాదయాత్ర‌.భద్రాద్రికి బదులుగా ములుగు నుండి పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు
హాత్ సే హాత్ జోడో అభియాన్ లో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రణాళిక మరోసారి మారింది. ముందుగా నిర్ణయించినట్లుగా భద్రాచలంలో కాకుండా ములుగు నియోజకవర్గం మేడారం సమ్మక్క, సారలమ్మ చెంత నుంచి ప్రారంభంకానుంది. అదివాసీ బిడ్డల అదిదేవుళ్లను దర్శించుకుంటారు… అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు..అనంతరంమలుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో ఈనెల 6న పాదయాత్ర ప్రారంభం అవుతుంది. 6న సాయంత్రం ములుగు నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ ప్రారంభ సభలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మానిక్ రావు ఠాక్రే పాల్గొంటారు.

 

 

 

పాదయాత్రలో రేవంత్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ నమ్మకాన్ని అనుసరిస్తున్నారు. యాత్ర.. ఫర్ చేంజ్ అని నామకరణం చేశారు. అప్పట్లో సబితా ఇంద్రారెడ్డిని తన సోదరిగా ప్రకటించుకున్న వైఎస్ఆర్… ఆమె నియోజకవర్గం చేవెళ్ల నుంచే తన పాదయాత్రను ప్రారంభించారు. రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో సీతక్క నియోజకవర్గం నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు

Leave A Reply

Your email address will not be published.