పరీక్షల లీకేజీలో కేటీఅర్ పీఎ తిరుపతే సూత్రదారి రేవంత్ రెడ్డి

లీకేజీల పై న్యాయ పోరాటం చేస్తాము

కామారెడ్డి  జిల్లా    ఎల్లారెడ్డి లో    టీఎస్ పీఎస్సీ  పరీక్షల  లీకేజ్  పై  టీపీసీసీ అధ్యక్షుడు   రేవంత్ ‌ నిర్వహించిన. సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ దారుణమన్నారు.2016 నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతూ ప్రతిభావంతులు, పేద అభ్యర్థులు నష్టపోతున్నారని  అందోళన వ్యక్తం చేశారు..పేపర్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వాన్ని రద్దు చేయాలని  డిమాండ్ చేశారు..ఇద్దరికే సంబంధముందంటూ కేటీఆర్ అతి తెలివితేటలు ప్రదర్శించారన్నారు.కేటీఆర్ ను బర్తరఫ్ చేయడమే కాదు చంచల్ గూడ్ జైల్లో పెట్టాలన్నారు.9 మందిని అరెస్ట్ చేశారు.. వారంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు

 

నిందితుల దగ్గరకు చంచల్ గూడకు వెళ్లి ఎవరు మధ్యవర్తిత్వం చేస్తూ వెళ్లారు.. పేర్లు బయటపెడితే చంపేస్తామన్నారో అన్ని బయటకు రావాలన్నారు.చంల్ గూడ సందర్శకుల జాబితా అన్ ఎడిటెడ్ వెర్షన్, సీసీ కెమెరాల ఫుటేజ్ విడుదల చేయాలన్నారు.ఎవరు ఈ లీక్ వెనుకున్నారో తేటతెల్లం చేయాలి..నిందితులను కస్టడీకి తీసుకోకముందే కేటీఆర్ రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ మాత్రమే నిందితులని ఎలా నిర్ధారించారు..?టీఎస్పీఎస్సీలో పనిచేసే ఉద్యోగులెవరైనా ఆ సంస్థ నిబంధనల మేరకు ఆ సంస్థ నిర్వహించే పరీక్షలకు పోటీ పడేందుకు అనర్హులు.కానీ, కేసీఆర్, కేటీఆర్ చొరవతో 20 మంది ఉద్యోగులకు ఎన్వోసీ ఇచ్చిన మాట వాస్తవం కాదా..? చెప్పాలన్నారు.ఒకవేళ పోటీ పరీక్ష రాయాలంటే రాజీనామా చేయాలి, లాంగ్ లీవ్ లో వెళ్లాలి లేదా ఇతర శాఖలకు బదిలీపై వెళ్లి ఉండాలి…టీఎస్పీఎస్సీలో పనిచేసే మాధురీకి ఫస్ట్ ర్యాంక్ రావడం‌, రజనీకాంత్ రెడ్డికి నాల్గో ర్యాంక్ రావడం వెనుక కారణాలేంటో తెలియాలన్నారు

జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన రాజశేఖర్ రెడ్డితో అదే మల్యాల మండలంకు చెందిన కేటీఆర్ పీఏ తిరుపతికి సంబంధాలున్నాయని ఆరోపించారు.ఔట్ సోర్సింగ్ లో రాజశేఖర్ రెడ్డికి ఉద్యోగం ఇప్పించి, ప్రమోషన్ ఇప్పించడంలో తిరుపతి పాత్ర ఉందన్నారు.కేటీఆర్ ప్రమేయంతోపాటు కేసీఆర్ ఆఫీస్ పాత్ర కూడా ఉందన్నారు.తిరుపతికి రాజశేఖర్ రెడ్డి స్నేహితుడన్నారు.మల్యాల మండలం నుంచి ఎగ్జామ్ రాసిన వారికే 25 మందికి 103 అత్యధిక మార్కులు రావడం వెనుక ఏం జరిగిందో తేలాలన్నారు

టీఎస్పీఎస్సీ మంత్రులు, చైర్మన్, సెక్రటరీ పాత్ర లేదని నిరూపించుకోవాలంటే ఈ మొత్తం వ్యవహారం విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు.కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి పాత్రపై కూడా విచారణ చేయించాలన్నారు

నిందితులందరి పూర్తి వివరాలు వెల్లడించాలని  డిమాండ్ చేశారు.టీఎస్పీఎస్సీ లో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చిందా, లేదా బయటపెట్టాలన్నారు.ఇవన్నీ కేటీఆర్ కు తెలుసా, లేదా చెప్పాలన్నారు.15 ప్రశ్నలకు సంబంధించిన ప్రశ్నాపత్రం బయటకు వచ్చిందన్నారుమంత్రి పేషీలో జరిగిన తతంగమంతా మంత్రికి తెలువకుండా ఎలా జరుగుతుందన్నారు.ఈ ఆరోపణల నుంచి కేటీఆర్ గానీ.. ప్రభుత్వంగానీ తప్పించుకోలేదన్నారు.నిన్న మంత్రి కేటీఆర్ తత్తరపాటు, తొందరపాటే మంత్రి వ్యవహారాన్ని కళ్లకు కట్టిందన్నారు.గతంలోనూ ఇదే కేటీఆర్ దోస్తైన వ్యక్తి కి చెందిన గ్లోబరీనా అనే సంస్థకు ఇంటర్ పరీక్షల కాంట్రాక్టు అప్పజెప్పారు.అప్పుడు కూడా ఇదే టీఎస్పీఎస్సీ జనార్దన్ రెడ్డి విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేశారన్నారు.. ఇరవై ఏడు మంది బలి తీసుకున్నారన్నారు.. లీకేజీ  పై న్యాయపోరాటం చేస్తామన్నారు…  లీకేజీలతో  పరీక్షల రద్దుచేసేంత వరకు తమ పోరాటం అగదని  హెచ్చారించారు రేవంత్

Leave A Reply

Your email address will not be published.