పార్టీమారిన.కాంగ్రేస్ ఎమ్మెల్యేలను ఉరితీయాలి
టిఅర్ ఎస్ లో చేరిన కాంగ్రేస్ ఎమ్మెల్యేల పై సంచలన వ్యాఖ్యలు చేసిన. టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి

..lపార్టీ మారారు…అమ్ముడు పోయారు…ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉరితీయాలని టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..
12మంది ఎమ్మెల్యేలను రాజకీయంగా బొంద పెట్టాల్సిన బాధ్యత తెలంగాణా సమాజంపై ఉందన్నారు..ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజక వర్గం కామేపల్లి మండలం లో హాత్ సే హాత్ జోడోయాత్ర లో భాగంగా కొత్త లింగాల క్రాస్ రోడ్ లో కార్నర్ మీటింగ్ లో ప్రసంగించిన రేవంత్ రెడ్డి….నిజంగా బీజేపీ కేసీఆర్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని భావిస్తే 12 మంది ఎమ్మెల్యేలపై కూడా సీబీఐ విచారణ జరపాలన్నారు..
హైకోర్టు ఆదేశాల మేరకు 12 మందిపై కూడా విచారణ చేయించాలని డిమాండ్ చేశారు..అలా చేయకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి కేసీఆర్ కు లొంగిపోయినట్లు గా భావించాల్సి ఉంటుందన్నారు..నకిలీ వితనాల్లా.. తెలంగాణ రాజకీయాల్లో నకిలీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్న రేవంత్ రెడ్డి … పార్టీ మారిన 12 మందిని డిపాజిట్లు రాకుండా ఓడగొట్టాలన్నారు..
ఆనాడు వైఎస్ నేతృత్వంలో రైతులకు 9 గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు…
రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరెంటు కోతలపై రైతులు రోడ్డెక్కుతున్నారన్నారు…24 గంటల కరెంట్ ఇవ్వడం కేసీఆర్ తో కాదన్నారు..ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన ఘటన రైతులు మరచిపోలేదని…అందుకు కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు…
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు రేవంత్ రెడ్డి…పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ,దళితులకు మూడెకరాలు భూమి ఇవ్వలేదన్నారు..
రైతులకు లక్ష రుణమాఫీ చేయలేదని . రైతుల కోసం తాము చేసే పోరాటంలో కమ్యూనిస్టులు కలిసిరావాలని కోరారు రేవంత్ రెడ్డి… త్వరలోనే కల్వకుంట్ల రాజ్యాన్ని ఖతం చేసి ప్రజా రాజ్యాన్ని నిర్మించుకుందామని..జనవరి 1, 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు…ఇళ్లు కట్టుకునే ప్రతీ పేదలకు రూ.5లక్షలు,రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ దే అన్నారు …ఖాళీ గా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రేస్ తీసుకుంటుందన్నారు …అటవీ భూముల హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలిచే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని….జనవరి 26, 2024 బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం శిలాఫలకం వేసే బాధ్యత మాదే అన్నారు రేవంత్ రెడ్డి …బయ్యారం ఉక్కు కర్మాగారంతో వేలాది యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు…